Star Heroine : సినీ హీరోయిన్లు కేవలం సినిమాలు మాత్రమే కాదు కొన్ని ప్రత్యేక టాలెంట్స్ ను కలిగి ఉంటారు.. ఇప్పటివరకు ఎందరో ముద్దుగుమ్మలు తమలోని టాలెంట్ ను బయటపెట్టి ఔరా అనిపించారు.. తాజాగా ఓ హీరోయిన్ స్పోర్ట్స్ లో తన సత్తా చాటుతూ అనేక సార్లు మెడల్స్ గెలిచినట్లు తెలుస్తుంది. మొన్నామధ్య ఆమె మెడల్ సాధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.. ఇంతకీ ఎవరా హీరోయిన్ అని ఆలోచిస్తున్నారు కదూ.. ఆమె ఎవరో కాదు నివేదా పేతురాజ్..
ఏంటి .. అస్సలు నమ్మలేకున్నారు కదూ .. కానీ ఇది నిజం.. మెంటల్ మదిలో కథాకనాయికగా పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత బ్రోచేవారెవరురా, రెడ్, పాగల్, అల వైకుంఠపురంలో, దాస్ కా ధమ్కీ వంటి హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ ఈ బ్యూటీకి తెలుగులో అంతగా అవకాశాలు రాలేదు. అటు తమిళంలోనూ వరుస ఆఫర్స్ అందుకుంటూ.. ఓటిటిలో పలు వెబ్ సిరీస్‌లలో నటిస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. అంతేకాదు అప్పుడప్పుడు తనలోని టాలెంట్ ను కూడా బయట పెడుతూ వస్తుంది..
ఈ ముద్దుగుమ్మ బ్యాడ్మెంటన్ ఛాంపియన్ అన్న విషయం చాలా మందికి తెలియదు.. కానీ ఇది నిజం.. ఇటీవల జరిగిన పోటీలో విజేతగా నిలిచి అందరిని ఆశ్చర్యపరిచింది.. ఈ బ్యూటీ ఇప్పటికే ఎఫ్ 1 కార్ రేసర్‌గా.. ఫార్ములా కార్ రేసింగ్ లో పలు పతకాలు సాధించిన ఈ బ్యూటీ.. ఇప్పుడు బ్యాడ్మింటన్ ఛాంపియన్ గా కూడా నిలిచి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది. తమిళనాడులో జరిగిన స్టేట్ లెవల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్ షిప్ లో ఆడి విన్నర్ గా నిలిచింది . అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారాయి.. ఇక సినిమాల పరంగా చూస్తే .. సినిమాలను లైన్లో పెడుతూనే మరోవైపు వెబ్ సిరీస్ లలో నటిస్తూ బిజీగా ఉంది..