Anasuya – Sushank Bharadwaj : బుల్లితెర ఇండస్ట్రీలో జబర్దస్త్ ద్వారా యాంకర్ గా కెరియర్ మార్చేసుకున్న అనసూయ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన గ్లామర్ తో యువతను ఉర్రూతలూగించడమే కాదు వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటుంది కూడా.. అయితే ఒక్కొక్కసారి ఈమె చేసే కామెంట్ల వల్ల ట్రోల్స్ కూడా ఎదుర్కొంటూ ఉంటుంది.. అంతేకాదు తనను ఎవరైనా ఏమైనా అంటే అంతే రీతిలో రియాక్ట్ అవుతుంది కూడా.. అందుకే అటు ప్రొఫెషనల్ లైఫ్ లో కూడా ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.. ఇకపోతే అనసూయ బుల్లితెరకే పరిమితం కాకుండా.. వెండితెరపై కూడా అవకాశాలు అందుకుంటూ ప్రస్తుతం పాన్ ఇండియా సెలబ్రిటీగా పేరు దక్కించుకుంది..
అనసూయ – సుశాంక్ మధ్యలో ఇంకో అమ్మాయి.
ఇకపోతే అనసూయ ప్రొఫెషనల్ లైఫ్ గురించి అందరికీ తెలుసు.. ఇప్పుడు వ్యక్తిగత జీవితం కూడా ఓపెన్ బుక్ అనే చెప్పాలి.. ప్రేమ, పెళ్లి, గొడవలు అన్నింటినీ కూడా ఈమె అభిమానులతో పంచుకుంది. కొద్దిగా సమయం దొరికితే చాలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ ఉంటుంది. ముఖ్యంగా టీనేజ్ లో ఉన్నప్పుడే తన భర్త సుశాంక్ భరద్వాజ్ ను ప్రేమించి.. తొమ్మిది సంవత్సరాలు ఎదురు చూసిన తర్వాత… పెద్దలను ఒప్పించి మరీ వివాహం చేసుకుంది అనసూయ.. అటు అనసూయ – భరద్వాజ్ లజంట చాలా క్యూట్ గా ఉంటుందని చెప్పడంలో సందేహం లేదు.. అయితే.. ఇప్పటివరకు ఈ జంట గురించి ఏ రోజు కూడా నెగటివ్ ప్రచారం జరగలేదు.. కానీ ఇప్పుడు తాజాగా వీరిద్దరికి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది . అనసూయ – సుశాంక్ లను విడదీయాలని ఒక అమ్మాయి చాలా అనుకుందట.. వారి బంధానికి మధ్యలో అడ్డగోడగా నిలిచిందట .. తాజాగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది..
మేడం గట్టిగా ట్రై చేసి ఉంటే బ్రేకప్ పక్కా..
ప్రస్తుతం అనసూయ బుల్లితెరకు రీయంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. స్టార్ మా లో ప్రసారం అవుతున్న కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఇందులో శేఖర్ మాస్టర్ మరొక జడ్జి… ఈ షో మేకర్స్ అనసూయకు స్వీట్ సర్ప్రైజ్ కూడా ఇచ్చారు.. తాను చదువుకునే రోజుల్లో ఎన్సిసి ట్రైనింగ్ ఆఫీసర్ ఉన్న సరోజి బాలా వచ్చారు.. ఆమెను చూసి అనసూయ వెంటనే పరుగున వెళ్లి ఆమెను హగ్ చేసుకుంది. ఇక ఆ రోజుల్లో ఎన్సిసి క్యాంపులో చోటు చేసుకున్న విషయాలను కూడా వారు గుర్తు చేసుకున్నారు.. అనసూయ అబ్బాయిల కంటపడకుండా దాచేసి దాన్ని.. ఎవరు లైన్ వేస్తారో అని.. ట్రైనింగ్ ఆఫీసర్ అన్నారు.. యాంకర్ శ్రీముఖి మధ్యలో కల్పించుకొని మరి ఎన్సిసి క్యాంపు లోనే సుశాంక్ ని అనసూయ ప్రేమించారట కదా అని అడగ్గా.. వీరిద్దరిని విడదీయడానికి నేను అనేక ప్రయత్నాలు చేశాను అని ఎన్సిసి ఆఫీసర్ తెలిపారు.. మేడం వల్ల ఆ రోజుల్లో నేను, శశాంక్ ఒక ఫోటో కూడా దిగలేకపోయాము అని అనసూయ తెలిపింది .. తన మేడంని అనసూయ ఈ షో వేదికగా సన్మానించింది కూడా.. అదన్న మ్యాటర్.. ఆ మేడం గనుక కొంచెం గట్టిగా డ్యూటీ చేసి ఉంటే అనసూయ ఎవరి భార్య అయ్యేవారో.. మొత్తానికి అయితే ఆమె గట్టిగా ట్రై చేయకపోవడం వల్లే వీరిద్దరు ఇప్పుడు పెళ్లి చేసుకున్నారని నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.