Urvashi Rautela : షూటింగ్ లో ఊర్వశి కి గాయాలు… హాస్పిటల్లో తెల్లవార్లూ కష్టపడ్డ బాలీవుడ్ స్టార్..

Urvashi Rautela : బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి రౌటేలా ప్రస్తుతం తెలుగులో బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది.. ఈ అమ్మడు ప్రస్తుతం బాలయ్య నటిస్తున్న సినిమాలో నటిస్తుంది.. బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న NBK109 సినిమాలో ఈ బ్యూటీ నటిస్తుంది.. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. బాలయ్య బర్త్ డే కానుకగా విడుదల చేసిన గ్లింప్స్ కు ప్రేక్షకుల నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.. కాగా ఈ మూవీ షూటింగ్‌లో ఊర్వశి రౌటేలా తీవ్రంగా గాయపడిందని వార్తలు వినిపించాయి..

ప్రస్తుతం ఊర్వశి రౌటేలా గాయలకు ఆసుపత్రిలో చికిత్స పొందుతుందని తెలుస్తుంది.. ఊర్వశి టీం విడుదల చేసిన ప్రెస్ స్టేట్‌మెంట్‌లో ఆమెకు తీవ్రస్థాయిలో ఫ్రాక్చర్ అయ్యిందని పేర్కొంది. ఇప్పుడు ఊర్వశి ఆసుపత్రిలో చికిత్స పొందుతోందని, డాక్టర్స్ ఆమెకు ట్రీట్మెంట్ చేస్తున్నారని వెల్లడించారు. హై ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నప్పుడు ఆమె ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది.. అయితే ఆమెకు గాయలైన విషయం తెలుసుకున్న బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ ఆమెకు చికిత్సకు కావాల్సిన డబ్బులను సర్దుబాటు చేసినట్లు తెలుస్తుంది..

Bollywood hero Salman paid the hospital bill for Urvashi
Bollywood hero Salman paid the hospital bill for Urvashi

సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ హీరో ఇలా ఆమె కోసం చెయ్యడం అందరిని ఆలోచింపచేస్తుంది.. అయితే వీరిద్దరూ లివింగ్ రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఈ వార్తలో నిజమేంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఇకపోతే ప్రస్తుతం ఈ అమ్మడు రెండు నెలల వరకు షూటింగ్ పాల్గొనలేదని తెలుస్తుంది.. మిగిలిన షూటింగ్ పార్ట్ ను పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు.. ఇక బాలయ్య కూడా ఈ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడని టాక్.. అనుకున్న విధంగా షూటింగ్ పూర్తి అయితే మాత్రం త్వరలోనే సినిమాను విడుదల చేయనున్నారని సమాచారం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు