Kalki 2898AD Collections : ఒక్క అడుగు దూరంలో 1000 కోట్లు… కానీ, ఇక్కడే ఆగాల్సి వస్తోందిగా…

Kalki 2898AD Collections : పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన తాజా చిత్రం కల్కి.. ఈ సినిమా డూపర్ హిట్ టాక్ తో థియేటర్స్ లో దూసుకుపోతుంది. సినిమాలోని విజువల్స్, యాక్షన్ సీన్స్, మహాభారతం సీన్స్ చూసి దర్శకుడిని అందరూ అభినందిస్తున్నారు.. ఈ సినిమాకు మొదటి షో నుంచి ఇప్పటివరకు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది.. కలెక్షన్స్ పరంగా కూడా బాగాబే వసూల్ చేస్తూ వస్తుంది.. మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 191 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. రెండు రోజుల్లో 298 కోట్లు వసూలు చేయగా మూడు రోజుల్లో 415 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.. మొత్తంగా చూసుకుంటే రెండువారాలకు గాను రూ. 980 కోట్ల గ్రాస్ ను వసూల్ చేసినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు..

ఈ సినిమా 1500 కోట్ల టార్గెట్ పెట్టుకొని బరిలో దిగిన నాలుగు రోజుల్లోనే సగం కలెక్షన్స్ ను సాధించింది. ఈ సినిమా విడుదల సమయంలో ఎటువంటి సినిమాలు లేకపోవడంతో ఈ సినిమా కలెక్షన్స్ బాగానే రాబడుతుంది.. మరో రెండు రోజుల పాటు తెలుగులో ఏ సినిమా లేకపోవడం, బాలీవుడ్ లో కూడా చెప్పుకోదగ్గ సినిమాలు లేకపోవడంతో కల్కికి ఈ వారం కూడా కలిసొస్తుంది. వారం రోజుల్లో ఈజీగా 1000 కోట్లు దాటేస్తుందని అంచనా వేశారు.. కానీ అడుగు దూరంలో ఆగిపోయింది.. సినిమా రిలీజ్ కు ముందు ఈ సినిమా పక్కాగా 1500 కోట్లకు పైగా రాబడుతుందని ప్రొడ్యూసర్ చెప్పిన సంగతి తెలిసిందే..

kalki 2898AD box office latest collections
kalki 2898AD box office latest collections

మరోవైపు అమెరికాలో అయితే అన్ని రికార్దులని బ్రేక్ చేస్తూ కలెక్షన్స్ రాబడుతుంది కల్కి. ఇప్పటికే కల్కి సినిమా అక్కడ 20 మిలియన్ డాలర్స్ రాబట్టింది. అంటే మన లెక్కల్లో దాదాపు 83 కోట్లు. పలుచోట్ల కలెక్షన్స్ విషయంలో సరికొత్త రికార్డులు సెట్ చేస్తుంది కల్కి 2898AD సినిమా.. అయితే ఇక ఈ కలెక్షన్ పై పలు వార్తలు వినిపిస్తున్నాయి.. త్రిపుల్ ఆర్ రికార్డులను బ్రేక్ చేస్తే చాలు అని కొందరు అభిప్రాయ పడుతున్నారు.. మరికొందరు మాత్రం సినిమా 2000 కోట్లు వసూల్ చెయ్యడం పక్కా అని ఫ్యాన్స్ అంటున్నారు.. మరి చివరికి ఎంత రాబడుతుందో చూడాలి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు