Tripti Dimri: స్టార్ కపుల్స్ మధ్య చిచ్చు.. యానిమల్ బ్యూటీ అసాధ్యురాలే..!

Tripti Dimri: ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి డిమ్రీ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. యానిమల్ సినిమాలో రన్ బీర్ కపూర్ తో పూర్తి స్థాయిలో రెచ్చిపోయి నటించిన ఈమె.. బోల్డ్ కంటెంట్ తో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది.. ఈ సినిమాకి ముందు ఈమె చాలా సినిమాలలో నటించింది. కానీ ఏ ఒక్కటి కూడా పెద్దగా గుర్తింపును అందించలేదు. అయితే ఎప్పుడైతే ఈమె సందీప్ రెడ్డివంగా డైరెక్షన్ లో వచ్చిన యానిమల్ సినిమాలో నటించిందో.. ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రెటీ అయిపోయింది.. పట్టింది బంగారం అన్నట్టుగా ఈమెకు అన్ని కూడా స్టార్ హీరోల సినిమాలలోనే అవకాశాలు వస్తున్నాయి. ఇక తనకు గుర్తింపు తీసుకొచ్చిన బోల్డ్ క్యారెక్టర్ లోనే అన్ని సినిమాలలో నటిస్తూ మరింత అలరిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. అయితే ఇందులో భాగంగానే తాజాగా ఈమె ఒక సినిమాలో రెచ్చిపోయి మరీ నటించింది. ఈ సన్నివేశాలు చూసిన తర్వాత స్టార్ కపుల్స్ మధ్య ఈమె చిచ్చు పెట్టేలా ఉంది అంటూ నెటిజన్ లు కామెంట్లు చేస్తున్నారు. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Tripti Dimri: The rift between star couples.. Animal beauty is impossible..!
Tripti Dimri: The rift between star couples.. Animal beauty is impossible..!

బ్యాడ్ న్యూజ్ లో రెచ్చిపోయిన త్రిప్తీ..

తాజాగా గుడ్ న్యూజ్ సినిమా సీక్వెల్ బ్యాడ్ న్యూజ్ లో విక్కీ కౌశల్ తో కలిసి ఈ ముద్దుగుమ్మ నటిస్తోంది. అలాగే ఆషికీ 3 లో కూడా నటిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా బ్యాడ్ న్యూజ్ సినిమా నుంచి జానమ్ అనే పాటను విడుదల చేయగా.. ప్రస్తుతం ఈ పాట యువతరంలో ట్రెండీ గా మారింది. ఈ పాటలో మైండ్ బ్లాక్ అయ్యే రొమాన్స్ తో యువతను రెచ్చగొడుతోంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా నీటి అడుగున విక్కీతో లిప్ లాక్ చేసిన తీరు చూసే ఆడియన్స్ కు మతిపోతుంది… బాప్ రే అనేంతగా ఈ మధ్యకాలంలో ఒక రేంజ్ లో రొమాన్స్ పండిస్తున్న మరొక భామ ఇంకొకరు లేరని నిరూపిస్తోంది. కారణం ఏదైనా సరే బ్యాడ్ న్యూజ్ లోని ఈ జానమ్ పాట కుర్ర కారు హృదయాలను కొల్లగొట్టడం ఖాయం.. ఇప్పటికే సోషల్ మీడియాలో గూగుల్ ట్రెండింగ్ లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్స్ ను దక్కించుకుంది.

మాస్ ఆడియన్స్ కి మంచి మసాలా..

ఇక సినిమా టికెట్ ధర ఎంతైనా సరే చెల్లించి మరీ థియేటర్లకు వచ్చే మాస్ ఆడియన్స్ కి కావలసినంత మసాలా వడ్డిస్తోంది ఈ ముద్దుగుమ్మ.. పాటలు కంటెంట్ పరంగా ఇప్పటికే బ్యాడ్ న్యూజ్ ప్రేక్షకులను ఆకర్షిస్తుందని.. త్వరలోనే ఈ సినిమా విడుదలవుతుందని సమాచారం.

- Advertisement -

కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ మధ్య చిచ్చుపెట్టేలా ఉంది..

ఇకపోతే బుల్ బుల్ ఖలా చిత్రాలతో తన నటనలో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచిన ఈమె.. ఇప్పుడు గ్లామర్ డోస్ తోనే మంచి ట్రీట్ ఇస్తోంది. యానిమల్ సినిమా తర్వాత వెనుతిరిగి చూడాల్సిన పరిస్థితి ఏర్పడలేదు.. ఇకపోతే ఇదంతా బాగానే ఉన్నా ఈమెపై ఇప్పుడు విమర్శలు ఎక్కువవుతున్నాయి..కత్రినా కైఫ్ – విక్కీ కౌశల్ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. రొమాన్స్ ని చూస్తే మాత్రం కత్రినా కైఫ్ కచ్చితంగా ఫీల్ అవుతుందని.. ఇద్దరి మధ్య గొడవ జరగడం ఖాయం అంటూ నెటిజన్ లు కామెంట్ చేస్తున్నారు.. మొత్తానికైతే ఈ సన్నివేశాలు.. ఆ క్యూట్ కపుల్ మధ్య చిచ్చుపెట్టేలా కనిపిస్తున్నాయి..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు