Ariyana – Raj Tharun : టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన విషయం రాజ్ తరుణ్, లావణ్య ఎఫైర్ విషయం.. ఈ వార్త గత కొన్ని రోజులుగా సెన్సేషనల్ అవుతూ వస్తుంది.. హీరోగా సక్సెస్ అయిన రాజ్ తరుణ్ ప్రస్తుతం కేసులో ఇరుక్కున్నాడు.. తన మాజీ ప్రేయసి లావణ్య తన మోసం చేసాడని పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కింది.. ఈ కేసులో రోజు రోజుకు సంచలన విషయాలు బయట వస్తున్నాయి.. అతడికి అనేక మంది అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని ఆమె ప్రధాన ఆరోపణ.. మొన్న హీరోయిన్ పేరు వినిపించింది.. నిన్న బిగ్ బాస్ హాట్ బ్యూటీ అరియనా గ్లోరీ పేరు తెరపైకి తెచ్చింది.. అయితే ఈ వార్తలు చర్చనీయంశంగా మారిన సంగతి తెలిసిందే..
బయట తన పై ఇంతగా వార్తలు వినిపిస్తున్న కూడా అరియనా మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం పై పలువురు కామెంట్స్ చేస్తున్నారు.. ఇక నెటిజన్లు ఇప్పటికే అరియనా పై దారుణమైన ట్రోల్స్ చేస్తున్నారు.. కానీ ఈ హాట్ బ్యూటీ మాత్రం అస్సలు పట్టించుకోలేదు.. నిజానికి ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది.. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలోకి కూడా రాలేదని తెలుస్తుంది.. దీన్ని బట్టి చూస్తే అరియనా, రాజ్ తరుణ్ మధ్య నిజంగానే ఎఫైర్ ఉందా అనే వార్తలకు ఆజ్యం పోసినట్లు ఉంది.. మరి ఇప్పటికైనా ఈ బ్యూటీ రెస్పాండ్ అవుతుందో లేదో చూడాలి..
ఇక లావణ్య రోజుకో కేసుతో రాజ్ తరుణ్ ను ఇరికించేస్తుంది.. మొన్న తనకు పెళ్లయిందని పెట్టింది.. కానీ నేడు ఆమెకు అనేక సార్లు అబార్షన్ చేయించినట్లు మరో కేసు పెట్టింది.. అన్విక అనే పేరుతో రాజ్ తరుణ్ తో ఉన్నానని లావణ్య చెప్పింది.. అదే విధంగా అదే పేరుతో విదేశాలకు వెళ్లినట్లు చెప్పింది.. అంతేకాదు నాకు అభార్షన్ కూడా చేయించినట్లు చెప్పింది.. మాల్వి వచ్చాక తనను దూరం పెట్టినట్లు ఆమె ఈరోజు నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది.. మొత్తంగా చూసుకుంటే రోజురోజుకు ఈ కేసు బలంగా మారుతుంది.. రాజ్ తరుణ్ తప్పులు బయటకు వస్తున్నాయి.. మరి ఈ వార్తలు ఎంతవరకు వెళ్తాయో చూడాలి..