Anushka Shetty : నేను చేసిన చెత్త మూవీ అంటూ… బాలయ్యను దారుణంగా అవమానించిన స్వీటీ

Anushka Shetty.. యోగా టీచర్ గా కెరియర్ మొదలుపెట్టి.. ఆ తర్వాత సూపర్ సినిమాతో హీరోయిన్ గా మారిన అనుష్క శెట్టి తన అందచందాలతో యువతను ఆకట్టుకుని.. ఎంతోమంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది.. బిల్లా వంటి చిత్రాలలో ఏకంగా గ్లామర్ షో చేసేసి అందరినీ ఆకట్టుకున్న ఈమె అరుంధతి, బాహుబలి సినిమాలలో రాజసం ఉట్టిపడేలా నటించి.. భాగమతి చిత్రంతో భయభ్రాంతులకు కూడా గురిచేసింది. ఇక చివరిగా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాలో నటించిన ఈమె మొదటిసారి మలయాళం లో సినిమా చేస్తోందని సమాచారం. ఇకపోతే గత కొంతకాలంగా నెమ్మదిగా సినిమాలను సెలెక్ట్ చేసుకుంటోంది.దీనికి కారణం ఆమె బరువు పెరగడమే ప్రధానం.. ఇకపోతే అనుష్క తన కెరియర్లో ఎన్నో అద్భుతమైన చిత్రాలు ఉన్నాయి. అంతకుమించి పరమ చెత్త సినిమాలు కూడా ఉన్నాయి..

Anushka Shetty: That is the worst movie I have done.. Shocking comments on Mahesh Babu and Balayya..!
Anushka Shetty: That is the worst movie I have done.. Shocking comments on Mahesh Babu and Balayya..!

యోగా లేకపోతే జీవితమే లేదు..

గతంలో అనుష్క చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ వైరల్ గా మారుతున్నాయి.. ఆ ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ అనుష్క కొన్ని ప్రశ్నలు అడిగింది.. ఒకవేళ అనుష్కకు యోగ తెలియకపోతే ఆమె కెరియర్ ఎలా ఉండేది అని అడగగా.. అనుష్క మాట్లాడుతూ.. అసలు యోగా లేని జీవితాన్ని నేను ఊహించుకోలేను.. యోగా లేకుంటే నా కెరియర్ మరింత గందరగోళంగా ఉండేదేమో అంటూ తెలిపింది.

మహేష్ బాబు కు షాక్ ఇస్తూ..

కంఫర్టబుల్ గా అనిపించే కోస్టార్స్ ఎవరు అని అడుగుతూ.. గోపీచంద్, మహేష్ బాబు, రవితేజ పేర్లు చెప్పగా.. వెంటనే గోపీచంద్, మహేష్ బాబు లకు షాక్ ఇస్తూ.. రవితేజ అని చెప్పింది అనుష్క.. ఇకపోతే రవితేజ, అనుష్క గతంలో బలాదూర్, విక్రమార్కుడు సినిమాలలో నటించిన విషయం తెలిసిందే.. ఈ రెండు సినిమాలలో కూడా వీరి కాంబినేషన్ చాలా అద్భుతంగా పండింది.

- Advertisement -

నేను నటించిన చెత్త మూవీ..

ఇక తర్వాత మీకు నచ్చిన సినిమా ఏంటి ..? అనగానే నచ్చిన చిత్రం వేదం ,అరుంధతి అంటూ తెలిపింది.. అలాగే నచ్చని చిత్రం గురించి కూడా చెప్పండి అని అడగ్గా.. వెంటనే నా కెరియర్ లో నేను చేసిన అతి చెత్త సినిమా ఒక్క మగాడు.. నేను తీసుకున్న అతి పెద్ద తప్పుడు నిర్ణయం.. అంటూ చెప్పుకు వచ్చింది అనుష్క.. వైవిఎస్ చౌదరి, బాలకృష్ణ కాంబినేషన్లో వచ్చిన చిత్రం ఒకే ఒక్కడు.. ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. మొత్తానికి అయితే బాలకృష్ణకు షాక్ ఇస్తూ… తన కెరియర్లో బిగ్గెస్ట్ వరస్ట్ మూవీగా ఒక్క మగాడు సినిమాను వెల్లడించింది..

ఎన్టీఆర్ మొదటి ప్రాముఖ్యత..

ఇక ఎన్టీఆర్ , రామ్ చరణ్ చిత్రాలలో ఒకేసారి అవకాశం వస్తే.. ఏ హీరోకి ఒకే చెబుతారు అనగా.. మారు మాట్లాడకుండా వెంటనే ఎన్టీఆర్ సినిమాను ఎంచుకుంటాను అంటూ తెలిపింది అనుష్క.. మొత్తానికైతే అనుష్క చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు మళ్లీ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇకపోతే ఇప్పుడు అనుష్క మరో సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. మరి ఎప్పుడు ఎలాంటి సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుందో చూడాలి. ఏది ఏమైనా అనుష్క ఇంటర్వ్యూ కు సంబంధించిన విషయాలు ఇప్పుడు మళ్లీ వైరల్ గా మారుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు