Jaanam Song Trolls : యానిమల్ మూవీతో విశేషమైన గుర్తింపు దక్కించుకున్న హిందీ హీరోయిన్ త్రిప్తి దిమ్రిని తాజాగా రిజైన జానమ్ సాంగ్ లో చూసి నోరు వెళ్లబెడుతున్నారు నెటిజన్లు. మరీ ఇంతగా దిగజారాల్సిన అవసరం ఏంటి అంటూ ఏకీపారేస్తున్నారు. ఆ పాటలో కన్పించిన హీరో విక్కీ కౌశల్ కంటే త్రిప్తిపైనే దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది.
సాఫ్ట్ పోర్న్ గర్ల్ గా ముద్ర
ధర్మ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ‘బ్యాడ్ న్యూస్’ చిత్రం జూలై 19న విడుదల కానుంది. ఈ చిత్రంలో విక్కీ కౌశల్, త్రిప్తి డిమ్రీ, అమీ వర్క్ ప్రధాన పాత్రల్లో నటించారు. ‘బ్యాడ్ న్యూస్’ సినిమా పోస్టర్, ట్రైలర్‌ను విడుదల చేసి ఆసక్తిని పెంచేసిన మేకర్స్ ఈ చిత్రం నుండి రెండు పాటలను విడుదల చేశారు. మొదటి పాట ‘తౌబా తౌబా’కు మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ రెండో పాటకు మాత్రం తేవరమైన నెగెటివిటీ వస్తోంది.
‘బ్యాడ్‌న్యూస్’ చిత్రంలో రెండవ సాంగ్ ‘జానం సాంగ్’ తాజాగా విడుదలైంది. ఈ సాంగ్ సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఇందులో విక్కీ కౌశల్, త్రిప్తి దిమ్రీల చాలా బోల్డ్ సన్నివేశాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఈ పాటలో చాలా బెడ్రూమ్ సన్నివేశాలు ఉన్నాయి. ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడని బోల్డ్ సీన్స్ ఉండడం ప్రేక్షకులను షాక్ కు గురి చేసింది. దీంతో ఈ పాట కోసం తృప్తి దిమ్రీ, విక్కీ కౌశల్‌లు దారుణంగా ట్రోల్ అవుతున్నారు. ఈ పాటను ప్రజలు ‘వల్గర్’ అని కూడా ట్యాగ్ చేయడమే కాకుండా, త్రిప్తిపై సాఫ్ట్ పోర్న్ గర్ల్ గా ముద్ర వేస్తున్నారు.
మల్లికా షెరావత్ – రాఖీ సావంత్‌తో తృప్తి డిమ్రీకి పోలిక
హిందీ సినిమాలలో హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్ ఘాటుగానే ఉంటుంది. కానీ తాజాగా జానం సాంగ్ లో ఉన్నంత మాత్రం కాదు. దీంతో నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కో రకంగా రియాక్ట్ అవుతున్నారు. ట్విట్టర్లో త్రిప్తి దిమ్రీ పాట క్లిప్‌ను షేర్ చేస్తూ అందులో ఆమె రొమాన్స్ కు, పోర్న్ కు మధ్య ఉండే చిన్న గీతను దాటేసింది అని ఒక నెటిజన్ రాశారు. మరో నెటిజన్ ‘త్రిప్తి దిమ్రీ ఇప్పుడు మల్లికా షెరావత్, రాఖీ సావంత్‌ల దారిలోనే వెళుతోంది. ప్రతిసారీ ఎక్స్ పోజింగ్ చేస్తూనే ఉంటే ఆమెకు సినిమాలలో లీడ్ రోల్ దక్కదు. మల్లికా, రాఖీల కెరీర్ త్వరగా ముగిసినట్లే, త్రిప్తి కెరీర్ కూడా త్వరలో ముగియబోతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈ పాటలో వారిద్దరి మధ్య ఉన్న కెమిస్ట్రీ కొందరికి నచ్చితే, చాలామందికి మాత్రం అస్సలు నచ్చలేదు. యానిమల్ సినిమాతో త్రిప్తికి వచ్చిన పాపులారిటీ ఈ పాట వల్ల తగ్గిపోతోందని ఆమె అభిమానులు సైతం అంటున్నారు.
చేతి నిండా సినిమాలతో బిజీ
మల్లికా షెరావత్, రాఖీ సావంత్ కూడా తమ కెరీర్‌ను ముందుకు తీసుకెళ్లడానికి ఇలాంటి సన్నివేశాలు చేశారు. కానీ ఈ ఇద్దరి కెరీర్ ఊహించనంత త్వరగా ఎండ్ అయ్యింది. కానీ త్రిప్తి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోంది. ‘బాడ్ న్యూస్’ తర్వాత ఆమె ‘భూల్ భూలయ్యా 3’, ‘ధడక్ 2’ చిత్రాల్లో కనిపించనుంది.