Guna Re Release Controversy : గుణ రీరిలీజ్ పై బ్యాన్… న్యాయస్థానం షాకింగ్ ఆదేశాలు

Guna Re Release Controversy : ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీలో వివాదాలు ఎక్కువయ్యాయి. అయితే ఆల్మోస్ట్ ఆ వివాదాలన్ని కమల్ హాసన్ హీరోగా నటించిన గుణ సినిమా చుట్టూనే తిరుగుతుండడం విశేషం. రీసెంట్ గా మంజుమ్మెల్ బాయ్స్ అనే మలయాళం బ్లాక్ బస్టర్ సినిమాలో ప్రియతమా నీవచట కుశలమా అనే పాటను వాడుకోవడం కాంట్రవర్సీకి దారి తీసింది. తన పాటను తన నుంచి ఎలాంటి రైట్స్ పొందకుండా ఎలా వాడుకుంటారు అంటూ ఇళయరాజా కేసు వేశారు. ఇక ఇప్పుడేమో ఈ సినిమాను మరోసారి రీ రిలీజ్ చేయకుండా బ్యాన్ చేస్తూ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును ఆశ్రయించారు ఓ వ్యక్తి. తాజాగా ఈ వివాదంపై న్యాయస్థానం షాకింగ్ తీర్పునిచ్చింది.

వివాదం ఏంటంటే ?

సినిమా విడుదలైన ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల చేయడం ఈ రోజుల్లో కొత్తేమీ కాదు. అయితే ఓ సినిమాని మళ్లీ థియేటర్లలోకి తీసుకురావాలని చిత్రబృందాన్ని కోరుతూ సోషల్ మీడియాలో నెటిజన్లు నిర్మాతలను రిక్వెస్ట్ చేయడం అనేది మాత్రం అంత సాధారణం కాదు. కమల్ హాసన్ నటించిన గుణ సినిమాను మళ్లీ విడుదల చేయాలని తమిళ ప్రేక్షకులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. మలయాళీ మూవీ మంజుమ్మల్ బాయ్జ్స్ కూడా ఈ డిమాండ్ కు ఒక కారణమైంది.

మలయాళ చిత్రసీమలో వచ్చిన ఇటీవల మంజుమ్మెల్ బాయ్స్ బాక్స్ ఆఫీసు వద్ద దుమ్మురేపిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ నటించిన గుణ చిత్రం గుణ గుహ చుట్టూనే ఈ మూవీ ఉన్నందున, కమల్ సినిమాను రిరిలీజ్ చేసి, మంజుమ్మెల్ బాయ్స్ క్రేజ్ ను క్యాష్ చేసుకోవాలని ప్లాన్ చేశారు నిర్మాతలు. అందుకు తగ్గట్టుగానే జూన్ 21న గుణ మళ్లీ విడుదలైంది. కానీ ఈ రైట్స్ ను దక్కించుకున్న గన్‌శ్యామ్ హేమ్‌దేవ్ మద్రాస్ హైకోర్టులో పిరమిడ్ అండ్ ఎవర్‌గ్రీన్ మీడియా గుణ మూవీని రీరిలీజ్ చేయకుండా శాశ్వతంగా నిషేధించాలని కోరుతూ పిటీషన్ దాఖలు చేశారు. ఈ చిత్రం కాపీరైట్‌ను తాను కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు.

- Advertisement -

Guna actress Roshini : 'ഗുണ' വീണ്ടും ചര്‍ച്ചയാകുന്നു; അതിലെ 'അഭിരാമി' പിന്നീട് ഒരു പടത്തിലും അഭിനയിച്ചില്ല; കാരണം ഇതാണ്.!

స్టే విధించిన కోర్టు

ఆ పిటిషన్‌లో సినిమాకు పూర్తి యజమానిగా తనను ప్రకటించాలని, సినిమా రీ-రిలీజ్‌ ద్వారా వచ్చిన ఆదాయాన్ని వెల్లడించి, అంతే మొత్తాన్ని తనకు ఇవ్వాలని పిరమిడ్‌ అండ్‌ ఎవర్‌గ్రీన్‌ మీడియా కంపెనీని ఆదేశించాలని శ్యామ్ డిమాండ్‌ చేశారు. ఈ కేసు హైకోర్టు 2024 జూలై 10న బుధవారం న్యాయమూర్తి వెల్మురుగన్ ఎదుట విచారణకు వచ్చింది. ఆ తర్వాత సినిమా రీ-రిలీజ్‌పై మధ్యంతర నిషేధం విధిస్తూ, పిరమిడ్, ఎవర్‌గ్రీన్ మీడియా పిటిషన్‌పై జూలై 22లోగా స్పందించాలని ఆదేశించి, విచారణను వాయిదా వేసింది.

దలపతి ముందు చతికిలపడ్డ గుణ

గుణ మూవీ 1991 నవంబర్ 5న దీపావళికి విడుదలైంది. సంతాన భారతి దర్శకత్వం వహించారు. మణిరత్నం దర్శకత్వంలో రజనీకాంత్-మమ్ముటీల దళపతితో బాక్సాఫీస్ వద్ద గుణ ఢీ కొట్టింది. గుణ విమర్శకుల ప్రశంసలు అందుకున్నప్పటికీ, యావరేజ్‌ టాక్ తెచ్చుకుంది. కానీ అప్పటి వరకు డెవిల్స్ కిచెన్ గా పేరుగాంచిన ప్రాంతాన్ని గుణ గుహగా మార్చి తమిళనాడులోనే పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దడంలో ఈ సినిమా కీలక పాత్ర పోషించింది. ఇళయరాజా స్వరపరిచిన పాటలు ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తున్నాయి. వాటిలో కన్మణి అన్పోట్ కథలన్ అనే పాట క్లాసిక్ గా పేరుగాంచింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు