Hey Jude: తప్పు ఎవరు చేసినా అది తప్పే అది తమ్ముడైన కూడా

Hey Jude: ప్రస్తుతం సోషల్ మీడియా సమాజంలో ఎంతటి కీలకపాత్రను పోషిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి విషయం వలన ఒక మంచి ఒక చెడు ఉన్నట్లు కూడా సోషల్ మీడియా వలన కూడా అలానే ఉంది. సోషల్ మీడియా వలన చాలామంది ఫేమస్ అయ్యారు. అలానే చాలామందికి సినిమా పరిశ్రమలో అవకాశాలు కూడా వచ్చాయి. ప్రస్తుతం ఈ సోషల్ మీడియాని ఉపయోగించుకొని కొందరు వెండితెరపై కూడా కనిపిస్తున్నారు.

సినిమాలను ప్రేమించే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, అలానే రీసెంట్ గా సినిమాను ట్రోల్ చేసే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. కేవలం సినిమాలను ట్రోల్ చేయటం మాత్రమే కాకుండా కొన్ని రీల్స్ ని ట్రోల్ చేయడం కూడా కొందరికి అలవాటుగా మారింది. ఇకపోతే రీసెంట్ గా ప్రణీత్ హనుమంతు అనే ఒక యూట్యూబర్ ఒక రీల్ పై ట్రోల్ చేస్తూ దారుణంగా చైల్డ్ అబ్యుజ్ చేశాడు. ఫాదర్ అండ్ డాటర్ రిలేషన్షిప్ పై దారుణమైన కామెంట్ చేశాడు. ప్రస్తుతం ప్రణీత్ హనుమంతు పై సోషల్ మీడియాలో చాలామంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరు రాష్ట్రాలు రాజకీయ నాయకులు సినిమా సెలబ్రిటీలు కూడా ప్రణీత్ కి తగిన శిక్ష పడాలి అంటూ పోస్టులు పెడుతున్నారు.

ఇకపోతే యూట్యూబర్ ప్రణీత్ గురించి చాలామందికి తెలిసింది. వాళ్ళ అన్నయ్య హే జ్యుడ్ కూడా ఒక యూట్యూబర్. అయితే ఈ విషయంపై తను కూడా స్పందించాడు. తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పే అవుతుంది ఆ తప్పుకు తగిన శిక్ష పడాల్సిందే అది తమ్ముడైన కూడా అంటూ ఒక వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో కింద కొందరు జ్యుడ్ ను మెచ్చుకుంటున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు