Sai Pallavi: నా డ్రీమ్ రోల్ అదే.. ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నా..!

Sai Pallavi: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ బ్యూటీగా గుర్తింపు సొంతం చేసుకున్న సాయి పల్లవి గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు.. ప్రేమమ్ అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. ఆ తర్వాత ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుని మొదటి సినిమాతోనే తన అందంతో చలాకీతనంతో అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మెన్స్ తో యువతను ఆకట్టుకున్న సాయి పల్లవి.. ఆ తర్వాత సెలెక్టెడ్ గా పాత్రలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది

Sai Pallavi: That's my dream role.. Waiting for the chance..!
Sai Pallavi: That’s my dream role.. Waiting for the chance..!

సాయి పల్లవి సినిమాలు..

ముఖ్యంగా సావిత్రి, సౌందర్య తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకుంది సాయి పల్లవి.. కేవలం సాంప్రదాయ పద్ధతిలోనే నటిస్తూ అందరినీ అలరిస్తోంది.. గ్లామర్ ప్రపంచంలో.. హాట్ డోస్ పెంచితేనే అవకాశాలు వస్తాయి అని చెప్పే వాళ్ళందరికీ ఈమె గట్టి సమాధానం ఇస్తుందని చెప్పవచ్చు.. ఎటువంటి గ్లామర్ షో చేయకుండానే తన అందచందాలతో యువతను ఆకట్టుకుంటుంది..పద్ధతిగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈమె.. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు మరోసారి నాగచైతన్యతో తండేల్ సినిమాలో నటిస్తోంది. అలాగే బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న విషయం తెలిసిందే.. రణబీర్ కపూర్ రాముడిగా నటిస్తున్న హిందీ రామాయణం సినిమాలో సీతగా సాయి పల్లవి అవకాశాన్ని దక్కించుకున్నట్లు సమాచారం.

నా డ్రీమ్ రోల్ అదే..

ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తాజాగా తన డ్రీమ్ రోల్ గురించి చెప్పుకొచ్చింది. ఇంటర్వ్యూలో భాగంగా మీకు నచ్చిన పాత్ర ఏంటి..? అని యాంకర్ అడగగా.. సాయి పల్లవి మాట్లాడుతూ.. నాకు కామియో రోల్ అంటే చాలా ఇష్టం.. పూర్తిస్థాయిలో ప్రేక్షకులను నవ్వించాలి.. లేడీ కమెడియన్ అనిపించుకోవాలి.. అలాంటి పాత్ర ఒక్కటి వచ్చినా చాలు.. నటిస్తాను అంటూ తన డ్రీమ్ రోల్ గురించి చెప్పుకొచ్చింది సాయి పల్లవి.. మొత్తానికి అయితే తన డ్రీమ్ రోల్ గురించి చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

- Advertisement -

సాయి పల్లవి వ్యక్తిగత జీవితం..

ఇక సాయి పల్లవి వ్యక్తిగత విషయానికి వస్తే.. గత ఏడాదే తన చెల్లెలి పూజా కన్నన్ కి దగ్గరుండి మరీ పెళ్లి చేసిన ఈమె.. ఇంకెప్పుడు వివాహం చేసుకుంటుంది అంటూ అభిమానులు సైతం కామెంట్లు చేస్తుండగా.. ఇటీవల ఒక షాకింగ్ న్యూస్ చెప్పింది.. రిలేషన్ లో ఉన్నా అంటూ హాట్ బాంబు పేల్చింది ఈ ముద్దుగుమ్మ.. మహాభారతంలో అర్జునుడి కుమారుడు అభిమన్యుడు అంటే తనకు చాలా ఇష్టమని అతడి గురించి దాదాపు పది సంవత్సరాలుగా తెలుసుకుంటున్నాను అంటూ తెలిపింది.. అంతేకాదు అభిమన్యుడితోనే తాను రిలేషన్ లో ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఇలాంటివన్నీ బాగానే చెబుతోంది కానీ మరెప్పుడు వివాహం చేసుకుంటుంది అంటూ అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ప్రస్తుతం సినిమాల పైన దాచి పెట్టిన ఈమె మరొకవైపు డాక్టర్ గా కూడా తన వృత్తిని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.. అటు హీరోయిన్ గా ఇటు డాక్టర్ గా కూడా ప్రేక్షకులకు వినోదాన్ని, సేవలను రెండూ ఒకేసారి అందించే ప్రయత్నాలు చేస్తోంది.. మరి ఇందులో ఏ విధంగా సక్సెస్ అవుతుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు