Mr Bachchan: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ డైరెక్టర్లు హరీష్ శంకర్ ఒకరు. సాక్షి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్. అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా ఊహించిన విజయాన్ని సాధించుకోలేకపోయింది. ఎవరైనా దర్శకుడుగా ఒక సినిమా చేసిన తర్వాత రెండవ సినిమా చేయడానికి ప్రయత్నిస్తారు. మళ్లీ రచయితగా కెరియర్ ని మొదలు పెట్టరు. కానీ హరీష్ శంకర్ దర్శకుడుగా మొదటి సినిమా ఫెయిల్ అయిన తర్వాత పూరి జగన్నాధ దగ్గర రచయితగా పనిచేయటం మొదలుపెట్టాడు.
చిరుత బుజ్జిగాడు వంటి సినిమాలకు హరీష్ శంకర్ వర్క్ చేశాడు పూరి జగన్నాథ్ కెరియర్ లో ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ సాధించాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇకపోతే మిరపకాయ్ సినిమాతో మళ్లీ దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు హరీష్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. అక్కడితో హరీష్ దర్శకుడుగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సెటిలైపోయాడు. ఆ తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చేసి స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరీష్ కాంబినేషన్ అంటేనే అంచనాలు నెక్స్ట్ లెవెల్ లో ఉంటాయి. వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా మొదలై ప్రస్తుతానికి ఆగింది. మళ్లీ పవన్ కళ్యాణ్ డేట్ ఇచ్చిన తర్వాత ఆ సినిమా మొదలు కానుంది.
ప్రస్తుతం రవితేజ హీరోగా మిస్టర్ బచ్చన్ అనే సినిమాను చేస్తున్నాడు హరీష్. స్వతహాగా హరిష్ శంకర్, రవితేజ ఇద్దరు కూడా అమితాబచ్చన్ కి వీరాభిమానులు. సో ఈ టైటిల్ తో సినిమా వస్తుంది అంటే అంచనాలు వేరే రేంజ్ లో ఉంటాయి. ఈ సినిమాలో భాగ్యశ్రీ హీరోహిన్ గా నటిస్తుంది. మిక్కిజే మేయర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన పాటను అధికారికంగా రిలీజ్ చేశారు. ఈ పాట అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటుంది. అయితే ఈ పాట గురించి కొన్ని నెగిటివ్ కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి. అంత పెద్ద ఏజ్ ఉన్న రవితేజ చాలా ఏజ్ తక్కువ ఉన్న ఒక అమ్మాయి తో అలా డాన్స్ చేయటం ఏంటి అని కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు. దర్శకుడిని కూడా టార్గెట్ చేస్తున్నారు. దీనికి హరీష్ శంకర్ స్పందిస్తూ ఫిలిం మేకర్స్ ని ఆబ్జెక్టిఫై చేయటం కొత్త విషయం ఏం కాదు అంటూ కౌంటర్ వేశాడు.
Congratulations for the discovery.. i think you should apply for Nobel Prize… 👍👍
And pls continue objectifying film makers…. We welcome you https://t.co/g6J2pR0NXK— Harish Shankar .S (@harish2you) July 10, 2024