Indian 2 : ఇండియన్ 2 ఎండ్ టైటిల్స్ తర్వాత సర్ప్రైజ్… సూపర్ ట్విస్ట్ ఇచ్చిన డైరెక్టర్ శంకర్

Indian 2: ఒకప్పటికన్నా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషల్లోని సినిమాలకు సీక్వెల్ సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. అందులోనూ మరీ ముఖ్యంగా కొన్ని ఏళ్ల కిందట వచ్చి సక్సెస్ సాధించిన సినిమాలకు కొనసాగింపుగా ప్రాజెక్టులు రూపొందుతున్నాయి. అలా 1996 సంవత్సరంలో కమల్ హాసన్ హీరోగా నటించి సంచలనం సృష్టించిన “భారతీయుడు” సినిమాకు సీక్వెల్ గా “ఇండియన్ 2” సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో విశ్వనాయకుడు కమల్ హాసన్ హీరోగా…. దిగ్గజ దర్శకుడు ఎస్ శంకర్ రూపొందించిన సినిమానే “భారతీయుడు”.

దీనికి ఇప్పుడు సీక్వెల్ గా “ఇండియన్ 2” సినిమాను తెరకెక్కించనున్నారు. యూనివర్సల్ కాన్సెప్ట్ తో తెరకెక్కినటువంటి ఈ సినిమాపై అటు ప్రేక్షకుల్లో, ఇటు సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు ఏమాత్రం తీసుకొని విధంగా ఈ సినిమాను శంకర్ హై రేంజ్ లో రూపొందించారు. ఇక సందేశాత్మక కథతో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న “ఇండియన్ 2” సినిమాను జూలై 12వ తేదీన రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ కార్యక్రమాన్ని చిత్ర యూనిట్ శరవేగంగా జరుపుతోంది. అంతేకాకుండా పలు రకాల ఈవెంట్లను కూడా నిర్వహిస్తున్నారు.

మొత్తానికి ఇండియా వ్యాప్తంగా గత కొద్ది రోజుల నుంచి ఈ సినిమా హడావిడి కనిపిస్తుండటం గమనార్హం. ఇక ఈ సినిమాకు సంబంధించిన టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. టికెట్ ధరలు భారీగా పెంచుకోవడానికి అనుమతులు లభించాయి. ఇక టికెట్స్ రేట్లను భారీగా పెంచేశారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50…. మల్టీప్లెక్స్ లో రూ. 75 వరకు పెంచుకోవడానికి అనుమతులు జారీ చేసింది. ఇదిలా ఉండగా….ఇండియన్ 2 సినిమా రిలీజ్‌ కాకముందే.. ఓ అప్డేట్‌ ఇప్పుడు వైరల్‌ గామారింది.

- Advertisement -

Indian 2: These are the 5 main reasons to watch the movie for sure..?

ఇండియన్ 2 సినిమా ఎండ్ టైటిల్స్ తర్వాత ఇండియన్ 3 ట్రైలర్ ను చూపించనున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇక ఇండియన్ 3 సినిమా మరో ఆరు నెలల్లో రిలీజ్ అవుతుందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన విఎఫ్ఎక్స్ పనులు పూర్తి అయ్యాయట. దీంతో ఇండియన్ 3 సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలను పెరుగుతున్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు