Srinidhi Shetty : మరో తెలుగు సినిమాకు సైన్ చేసిన కెజిఎఫ్ హీరోయిన్?

Srinidhi Shetty : కెజిఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈ భామ కెజిఎఫ్ అనే ఒక్క సినిమాతో పాన్ ఇండియా వైడ్ గా క్రేజ్ సంపాదించుకుంది. అంతకు ముందు ఎం సినిమాలు చేసిందో కూడా తెలీదు గాని, కెజిఎఫ్ పార్ట్1, 2 సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. ఇక ఆ సినిమాల తర్వాత ఈ హీరోయిన్ సౌత్ లో ఓ రేంజ్ లో బిజీ అవుతుందనుకున్నారు అందరూ. కానీ కట్ చేస్తే.. ఆ సినిమా తరవాత ఇప్పటివరకు అరడజను సినిమాలు కూడా చేయలేదు. మధ్య లో విక్రమ్ నటించిన కోబ్రా అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. కానీ ఆ సినిమా కూడా ప్లాప్ కావడం వల్ల శ్రీనిధి శెట్టి కనిపించకుండా పోయింది. ఇకపోతే ఆ మధ్య రామ్ చరణ్ సినిమాలో నటిస్తుందని, ఎన్టీఆర్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందని వార్తలు వచ్చినా అవేవి నిజం కాదు. ఇక ఇప్పుడిప్పుడే ఈ భామ సినిమాల్లో బిజీ అవుతుండగా, ఈ క్రమంలో తెలుగులో రానాతో ఓ సినిమాలో ఛాన్స్ కొట్టేయగా, లేటెస్ట్ గా మరో తెలుగు సినిమాలో నటిస్తుందని అప్డేట్ వచ్చింది.

Srinidhi Shetty as heroine in Nani Hit 3 movie

మరో సినిమాకి సైన్ చేసిన శ్రీనిధి శెట్టి…

తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం శ్రీనిధి శెట్టి తెలుగులో త్వరలో నాని హీరోగా తెరకెక్కుతున్న సినిమాకు హీరోయిన్ గా సైన్ చేసిందని సమాచారం. శైలేష్ కొలను త్వరలో హిట్ యూనివర్స్ లో భాగంగా హిట్3 సినిమాని చేయనున్నాడన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు హిట్3 (HIT3) సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుందని తాజాగా వార్తలు వస్తున్నాయి. రీసెంట్ గా శైలేష్ కొలను కథ వినిపించగా, వెంటనే శ్రీనిధి ఒకే చెప్పేసిందని సమాచారం. ఇదిలా ఉండగా ఇప్పటికే రానా రాక్షస రాజు అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందని తెలిసందే. అలాగే సిద్ధు జొన్నలగడ్డ యొక్క ‘తెలుసు కథ’ సినిమాలో కూడా శ్రీనిధియే హీరోయిన్ అని సమాచారం. కానీ ఈ సినిమాలో ఎప్పుడు రిలీజ్ అవుతాయో చెప్పలేని పరిస్థితి.

- Advertisement -

మెల్లిగా బిజీ అవుతున్న కెజిఎఫ్ బ్యూటీ..

ఇక కెజిఎఫ్ తర్వాత వరుస సినిమాలు చేయనప్పటికీ, ఈ అమ్మడి క్రేజ్ అలాగే ఉంది. కాగా ఇప్పుడిప్పుడే సినిమాల్లో మళ్ళీ బిజీ అవుతుంది. ఇక ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ అప్డేట్ తో సహా తెలుగులో శ్రీనిధి శెట్టి హిట్3, రాక్షస రాజు, తెలుసు కదా సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తుండగా, తమిళ్ లో ఓ సినిమా చేస్తుంది. ఇక కన్నడలో కిచ్చా సుదీప్ నటిస్తున్న 47వ సినిమాలో కూడా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది. అంటే ఈ అమ్మడి చేతిలో ప్రస్తుతం ఐదు సినిమాలు ఉన్నాయన్నమాట. ఇక ఈ సినిమాల్లో ఒక్కటి క్లిక్ అయినా కూడా టాలీవుడ్ లో చక్రం తిప్పడం ఖాయమని చెప్పొచ్చు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు