RamCharan : అంబానీ ఇంట పెళ్ళికి గ్లోబల్ స్టార్.. ఎయిర్ పోర్ట్ లో ఉపాసన, క్లింకార తో చరణ్..

RamCharan : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకి సంబంధించి చరణ్ కి సంబంధించిన షూట్ మొత్తం పూర్తి కావడంతో చరణ్ ఫ్రీ అయిపోయాడు. కొన్ని రోజుల పాటు వెకేషన్ కి వెళ్లగా, త్వరలోనే బుచ్చిబాబు సినిమా కోసం రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉండగా ముంబైలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు ముంబైలో గ్రాండ్ గా జరుగుతున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే అనంత అంబానీ – రాధికా మర్చంట్ పెళ్ళికి సంబంధించి ప్రీ వెడ్డింగ్ అని హల్దీ ఈవెంట్ అని, సంగీత్ ఈవెంట్ అని మూడు నాలుగు సార్లు ఈవెంట్స్ జరగగా, ఫైనల్ గా ఇప్పుడు పెళ్లి వేడుకను కూడా చేయనున్నారు. జులై 12న జరుగనున్న పెళ్లి వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు ఎంతో మంది విచ్చేయనున్నారు. ఇప్పటికే చాలామంది సెలెబ్రిటీలు ముంబైకి చేరుకోగా, అక్కడ స్టార్ హోటళ్లు ఇప్పటికే భారీగా బుక్ అయ్యాయి.

RamCharan Upasana along with KlinKara at Mumbai for Anant Ambani - Radhika Merchant's wedding

ఫ్యామిలీతో అంబానీ పెళ్ళికి గ్లోబల్ స్టార్..

ఇక అనంత్ అంబానీ రాధికా మర్చంట్ ల పెళ్ళికి హాలీవుడ్, బాలీవుడ్ సహా సెలెబ్రిటీలు, అలాగే క్రీడా, రాజకీయ, బిజినెస్ కి సంబంధించిన సెలెబ్రిటీలు ఈ పెళ్లి వేడుకకు హాజరవనున్నారు. ఇక ప్రస్తుతం ముంబైలోని జియో వరల్డ్ సెంటర్ లో జరగబోయే అనంత్ – రాధికా పెళ్లి వేడుకలకు సెలబ్రిటీలు ఇప్పటికే చాలా మంది హాజరయ్యారు. ఇక తాజాగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కూడా ఈ పెళ్లి వేడుకలకు హాజరవుతున్నాడని తెలుస్తుంది. రామ్ చరణ్ – ఉపాసన క్లింకార తో కలిసి నేడు ముంబై ఎయిర్ పోర్ట్ దగ్గర ఉన్న వీడియో వైరల్ అవుతుంది. ఇక గతంలో కూడా అనంత్ – రాధికా ప్రీ వెడ్డింగ్ కి రామ్ చరణ్ – ఉపాసన కలిసి హాజరవడం విశేషం.

- Advertisement -

టాలీవుడ్ నుండి చరణ్ ఒక్కడేనా?

ఇక రామ్ చరణ్ ఆ మధ్య అంబానీ సంగీత్ వేడుకలకు హాజరవగా, ఇప్పుడు చరణ్ ఉపాసన దంపతులు, తమ కూతురు క్లింకారా తో కలిసి అంబానీ పెళ్లి వేడుకలకు హాజరవుతున్నాడు. అయితే ఇప్పుడు కూడా టాలీవుడ్ సెలెబ్రిటీలలో రామ్ చరణ్ ఒక్కడే అంబానీ ఇంట పెళ్ళికి హాజరవుతున్నట్టు తెలుస్తుంది. అప్పుడు కూడా టాలీవుడ్ నుంచి చరణ్ ఒక్కడే వెళ్లడం గమనార్హం. ఇక ఆ మధ్య చరణ్ బాలీవుడ్ స్టార్స్ తో కలిసి ప్రీ వెడ్డింగ్ ఈవెంట్ లో సందడి చేసిన వీడియో ఎంత వైరల్ అయిందో తెలిసిందే. ఇక ఈ మధ్య బాలీవుడ్ లో పలు ఈవెంట్స్ కి చరణ్ హాజరవ్వడంతో రామ్ చరణ్ నార్త్ లో కూడా బాగా పాపులర్ అయ్యాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు