Naveen vijaya krishna: తండ్రి పై అలాంటి వ్యాఖ్యలు చేసిన వీ.కే. నరేష్ కుమారుడు..!

Naveen vijaya krishna..తెలుగు సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ యాక్టర్లలో వీకే నరేష్ కూడా ఒకరు.. అలనాటి హీరోయిన్, నిర్మాత అయిన విజయనిర్మల కుమారుడే వీకే నరేష్.. బాల నటుడుగా తన కెరీర్ ని ప్రారంభించి.. పెద్దయ్యాక హీరోగా మారి ఎన్నో చిత్రాలలో హీరోగా సక్సెస్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా పేరు సంపాదించారు వీ.కే.నరేష్. ఎలాంటి పాత్రలోనైనా సరే సహజమైన నటనతోనే ఆకట్టుకుంటూ ఉంటారు. నరేష్ సినిమాల పరంగా సక్సెస్ అయినప్పటికీ..తన వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎప్పుడూ ఏదో ఒక విషయంలో వైరల్ గా మారుతూనే ఉంటారు.

Naveen vijaya krishna: VK who made such comments on father. Son of Naresh..!
Naveen vijaya krishna: VK who made such comments on father. Son of Naresh..!

నరేష్ నాలుగు పెళ్లిళ్లపై విజయ్ కృష్ణ కామెంట్స్..

ముఖ్యంగా వీకే నరేష్ పెళ్లిళ్ళ విషయమైతే ఇప్పటికీ హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది. ఇప్పటికే మూడు వివాహాలు చేసుకొని.. ప్రస్తుతం నటి పవిత్ర లోకేష్ తో కలిసి సహజీవనం చేస్తున్నారని విమర్శలు కూడా వినిపిస్తూ ఉంటాయి. కానీ నరేష్ పెద్ద కుమారుడు నవీన్ విజయ్ కృష్ణకు ఇంకా వివాహం మాత్రం కాలేదు. నవీన్ విజయ్ కృష్ణ ప్రస్తుత వయసు 40 ఏళ్లు.. దీంతో కన్న కొడుక్కి పెళ్లి చేయకుండా నాలుగో వివాహం చేసుకుంటున్నారా? అనే విమర్శలు కూడా నరేష్ పైన ఎన్నో వినిపిస్తూ ఉన్నాయి.. ఇలాంటి సమయంలో వీకే నరేష్ పెద్ద కుమారుడు నవీన్ పలు విషయాలను వెల్లడించారు.

రూమర్స్ పై క్లారిటీ..

ముఖ్యంగా తన కొడుక్కి ఒక పెళ్లి చేయకుండా.. నరేష్ మాత్రం నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నారని.. విజయ్ కృష్ణ ఇంకా బ్యాచిలర్ గానే ఉన్నారు అంటూ వార్తలు వైరల్ అయ్యాయి.. ఈ విషయం పైన స్వయంగా నవీన్ ను యాంకర్ ప్రశ్నించగా.. ఈ విషయాల పైన నవీన్ మాట్లాడుతూ అసలు ఇలాంటి విషయాలకు తాను కనెక్ట్ అవ్వనని.. ఇలాంటి విషయాలను ఎక్కువగా ఆలోచించను అని కూడా తెలియజేశారు. ఇలాంటి విషయాల పైన ట్రోల్ చేసే వారిని.. రూమర్స్ క్రియేట్ చేసే వారిని ఎవరు ఆపలేము అంటూ తెలిపారు.. ఇలా మాట్లాడే వారంతా తన తండ్రి ఆర్థికంగా , వ్యక్తిగతంగా కష్టాలలో ఉన్నప్పుడు ఎవరు ఆదుకోలేదు కదా అంటూ తెలిపారు.

- Advertisement -

దగ్గర ఉంటేనే కష్టమేంటో తెలుస్తుంది..

ఆయన పెద్ద కుటుంబం నుంచి వచ్చారు.. పెళ్లిళ్లు చేసుకుంటున్నారని అంటున్నారు.. కానీ ఆయన పడిన కష్టాలు ఎవరికీ తెలియదు.. ఇతరుల జీవితం మీద జోకులు వేయడం చాలా సులువే.. కానీ అనుభవించడం చాలా కష్టం.. తన తండ్రి ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. ఆయన వ్యక్తిగత జీవితం మాత్రమే అది అంటూ తెలిపారు. అంతేకాకుండా మరి మీ పెళ్లి ఎప్పుడు అని అడగగా.. ఇప్పటికే తన జీవితం మీద ఒక క్లారిటీ వచ్చింది అని.. తనకి చేసుకోవాలి అనుకున్నప్పుడు వివాహం చేసుకుంటానని తెలిపారు.. పెళ్లి చేసుకుని విడిపోవడం కంటే సరైన సమయంలో చేసుకోవడం మంచిది అంటూ తెలిపారు వీకే నరేష్ కుమారుడు నవీన్ కృష్ణ.

ఎడిటర్ గా పనిచేస్తున్న నవీన్ కృష్ణ..

గతంలో నవీన్ కృష్ణ హీరోగా కొన్ని చిత్రాలు అయితే చేసినప్పటికీ హీరోగా మాత్రం సక్సెస్ కాలేకపోయారు.. దీంతో ఇప్పుడు అవకాశాలు కూడా తగ్గినట్లుగా తెలుస్తోంది.. నవీన్ ఎప్పుడూ కూడా కుటుంబ సభ్యుల మీద ఆధారపడలేదు.. తనకు వచ్చిన పని.. ఎడిటర్ గా పనిచేస్తూ తాను స్వయంగా డబ్బులు సమకూర్చే పనిలో పడ్డట్టుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సైతం తెలియజేశారు. ఇటీవల సత్య షార్ట్ ఫిల్మ్ తీసి మంచి విజయాన్ని అందుకున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు