Bharateeyudu 2 : మర్మకళ వివాదంలో మేకర్స్ కు ఊరట… భారతీయుడు 2 రిలీజ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్

Bharateeyudu 2 : ఎన్నో అడ్డంకులను దాటుకుని ఎట్టకేలకు రిలీజ్ కు రెడీ అయిన భారతీయుడు 2 సినిమాకు రిలీజ్ కు కొన్ని రోజుల ముందే మరో సమస్య ఎదురైన విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలను ఆపాలంటూ ఆసాన్ రాజేంద్రన్ మదురై జిల్లా కోర్టును ఆశ్రయించడంతో వివాదం నెలకొంది. మర్మ కళ టెక్నిక్స్ కు సంబంధించిన విషయంలో రాజేంద్రన్ ఈ మూవీ రిలీజ్ కాకుండా నిషేధం విధించాలంటూ కోర్టుకు ఎక్కారు. అయితే తాజాగా ఈ వివాదంలో మదురై కోర్టు ఇచ్చిన తీర్పుతో మేకర్స్ కు ఊరట లభించింది.

భారతీయుడు 2 రిలీజ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్…

తాజాగా ఈ వివాదంపై విచారణ జరగగా భారతీయుడు 2 సినిమా రిలీజ్ కు కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా విడుదలపై స్టే ఇవ్వలేమన్న మదురై కోర్టు, రాజేంద్రన్ పిటిషన్ ను తోసిపుచ్చింది. రాజేంద్రన్ మర్మ కళ సన్నివేశాలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ తన పుస్తకం ఆధారంగా ఆ సన్నివేశాలు తీశారని ఆరోపించారు. కానీ నిర్మాతలు పార్ట్ వన్ లోని సన్నివేశాలను కొనసాగించామని క్లారిటీ ఇవ్వడంతో కోర్టు సినిమాను నిరభ్యంతరంగా రిలీజ్ చేసుకోవచ్చంటూ ఆదేశాలు జారీ చేసింది.

Ahead of 'Indian 2' release, complaint filed in court seeking ban on release! DEETS inside | Tamil Movie News - Times of India

- Advertisement -

అసలు వివాదం ఏంటంటే…

భారతీయుడు 2 ట్రైలర్ రిలీజ్ అయ్యాక ఆ సినిమా రిలీజ్ ను థియేటర్, ఓటిటిలో కూడా రిలీజ్ కాకుండా నిషేధం విధించాలంటూ మదురై జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు ఆసాన్  రాజేంద్రన్. అయితే ఈ మేరకు బుధవారం కోర్టులో విచారణ జరగగా దీనిపై స్పందించాలంటూ చిత్ర బృందానికి కాస్త సమయం ఇస్తూ, కోర్టు తదుపరి విచారణలను గురువారానికి వాయిదా వేసింది. అయితే భారతదేశంలోని పలు ప్రాచీన యుద్ధకళల్లో మర్మకళ కూడా ఒకటి. అందులో రాజేంద్రన్ ప్రసిద్ధుడు. ఆయన రాసిన ఓ పుస్తకాన్ని చదివి ఇన్స్పైర్ అయిన డైరెక్టర్ శంకర్ భారతీయుడు సినిమాలో మర్మకళకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను రూపొందించారు. అంతేకాదు సేనాపతి పాత్ర కోసం కమల్ హాసన్ కు రాజేంద్రన్ అప్పట్లో ప్రత్యేక శిక్షణ కూడా ఇచ్చారు.

అయితే ఇప్పుడు భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా రూపొందుతున్న భారతీయుడు 2 లో తన అనుమతి లేకుండానే మర్మకళ టెక్నిక్స్ వాడుకున్నారని రాజేంద్రన్ ఆరోపించారు. 1996 లో రిలీజ్ అయి, విజయం అందుకున్న భారతీయుడు సినిమాకు సీక్వెల్ రూపొందించాలని అనుకున్నప్పటి నుంచి ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయి మేకర్స్ కి. ఆరేళ్ల క్రితమే మొదలైన ఈ మూవీ షూటింగ్ లాక్ డౌన్, సెట్స్ లో అగ్రి ప్రమాదం, బడ్జెట్ సమస్యలు లాంటి ఊహించని సంఘటనలు కారణంగా వాయిదా పడుతూ వచ్చింది. ఎట్టకేలకు ఇన్నేళ్ల తరువాత భారతీయుడు 2 షూటింగ్ ను పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి రెడీ అయ్యారు. అంతలోనే రిలీజ్ కు కొన్ని గంటలు ఉందనగా రాజేంద్రన్ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ కోర్టుకెక్కారు. ఏదైతేనే మొత్తానికి అన్ని అడ్డంకులను దాటుకుని భారతీయుడు 2 మూవీ ఈనెల 12న థియేటర్లలోకి రాబోతోంది. మరి మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు