Anil Ravipudi: వాట్ ఏ విజన్ , వాట్ ఏ థాట్ , పిచ్చోళ్ళు అయిపోయారు మా టీం అంతా

Anil Ravipudi: ఎస్ఎస్ రాజమౌళి తర్వాత తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఒక్క డిజాస్టర్ కూడా తీయని డైరెక్టర్ అంటే అనిల్ రావిపూడి. పటాస్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అనిల్ అది తక్కువ టైంలోనే మంచి పేరని సాధించుకొని స్టార్ డైరెక్టర్ అయిపోయాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు విక్టరీ వెంకటేష్ లాంటి పెద్ద పెద్ద స్టార్లను డీల్ చేసి సూపర్ హిట్స్ అందుకున్నాడు. ఇకపోతే అనిల్ రా గుడి ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ హీరోగా పండగకు వస్తున్నాం అనే సినిమాను చేస్తున్నాడు.

విక్టరీ వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ మూవీ ఇది ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తుంది సంక్రాంతి కానుక ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు కొన్ని రోజుల క్రితం ముహూర్తాన్ని పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నేడు హైదరాబాద్ లో ప్రారంభమైంది. ఈ సినిమాకి సంబంధించిన మేకింగ్ వీడియో కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ సినిమాలో హీరో మాజీ లవర్ , ప్రస్తుతం ఉన్న భార్య, వీళ్ళు ముగ్గురు చుట్టూ జరిగే ఒక ముక్కోణపు క్రైమ్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా.

Upendra Limaye

- Advertisement -

ఇకపోతే ఈ సినిమాలో ఉపేంద్ర లేమాయి ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే ఉపేంద్ర సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన అనిమల్ సినిమాలో ఫ్రెడి అనే ఒక కీలక పాత్రలో కనిపించారు. ఆ సినిమాలో వాటే విజన్ వాటే థాట్ అని ఉపేంద్ర చెప్పిన డైలాగ్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ నటుడు ఇప్పుడు విక్టరీ వెంకటేష్ సినిమాలో కనిపిస్తున్నట్లు స్వయంగా ట్విట్టర్ వేదికగా అనిల్ రావిపూడి ప్రకటించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు