Praneeth Hanumanthu:14 రోజులు చంచల్ గూడా జైల్లో , అసలు ఏ ఏ కేసులు నమోదు చేశారంటే

Praneeeth Hanumanthu: ఈ మధ్యకాలంలో ఏ విషయం జరిగిన కూడా క్షణాల్లో సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంది. రీసెంట్ టెన్స్ లో అంతగా పాపులర్ అయిపోయింది సోషల్ మీడియా. ఒకప్పుడు ఏదైనా ఒక కొత్త విషయం తెలియాలన్నా ఎక్కడైనా జరిగిన సంచలన విషయాలు బయట పడాలన్న టీవీల్లోనూ వార్తాపత్రికల్లోనూ చూసి తెలుసుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు అలా కాకుండా ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో సోషల్ మీడియాలో కనిపిస్తుంది. లేకపోతే ఇదే సోషల్ మీడియాని ఉపయోగించుకుంటూ చాలామంది తమ కెరియర్లో పైకి వచ్చారు చాలామంది సినిమా రంగాల్లో కూడా రాణిస్తూ ఉన్నారు. అలానే సోషల్ మీడియాని ఉపయోగించి జైలు పాలైన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

ఇక రీసెంట్గా ప్రణీత్ హనుమంతు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముందుగా యూట్యూబ్లో చిన్న చిన్న వీడియోలు చేసుకునే ప్రణీత్. తర్వాత కొన్ని కొన్ని సినిమాలను ట్రోల్ చేయటం మొదలుపెట్టాడు. సినిమాలను టోల్ చేయడమే కాకుండా సినిమాలో నటించే యాక్టర్లను కూడా ట్రోల్ చేయడం మొదలుపెట్టాడు. ఇకపోతే అలా ప్రణీత్ కి కొన్ని సినిమా అవకాశాలు కూడా వచ్చాయి. కొంతమంది సినిమా ప్రముఖులు మూవీ ప్రమోషన్స్ కూడా వాడారు. సుధీర్ బాబు నటించిన హరోం హర సినిమాలో ఒక పాత్రలో కూడా ప్రణీత్ కనిపించాడు.

ఇకపోతే రీసెంట్గా ఎక్కడ చూసినా కూడా ప్రణీత్ మీద నెగిటివ్ కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. ఇంకా ప్రణీత్ ను సోషల్ మీడియా వేదికగా చాలామంది తిడుతూనే ఉన్నారు. దీని కారణం ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న క్యూట్ వీడియోని అబ్యూజ్ చేస్తూ అసభ్యకరమైన కామెంట్ చేయడమే. ఈ తరుణంలో ప్రణీత్ ని అరెస్ట్ చేయాలి అంటూ చాలామంది సినిమా ప్రేమికులు రాజకీయ ప్రముఖులు ట్విట్టర్ వేదిక పోస్ట్ పెట్టారు. ఎట్టకేలకు దీనిని సీరియస్గా తీసుకున్న పోలీసులు ప్రణీత్ ని అరెస్టు చేశారు.

- Advertisement -

ఒక 14 రోజులు పాటు చంచల్ గూడా జైల్లో ఉండాలి అని నాంపల్లి కోర్టులో తీర్పునిచ్చారు ఇంతకీ ప్రణీత్ మీద వేసిన కేసులు విషయానికి వస్తే.

Four sections have been filed against Praneeth:

– Section 67B of the IT Act (Information Technology Act)
– POCSO Act (Protection of Children from Sexual Offences Act)
– Section 79 of the IT Act
– Section 294 of the Indian Penal Code (IPC).

ఈ కేసులు మాత్రమే కాకుండా ప్రణీత్ పై ఇంకా కేసులు పెట్టే అవకాశం కూడా ఉంది అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ప్రణీత్ చేసిన అన్ని పాత వీడియోస్ ని కూడా తవ్వడం మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు