Nandarmoori Mokshagna : నందమూరి వారసుడి సినిమాకు నిర్మాత ఎవరో తెలుసా?

Nandamoori Mokshagna : టాలీవుడ్ లో నందమూరి అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న నందమూరి మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అతి త్వరలోనే జరుగనుందన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది ఎంతో మంది హీరోల వారసులు పరిచయమవుతున్నా అందరి దృష్టిని ఆకరిషిస్తుంది మోక్షజ్ఞ. మోక్షజ్ఞ కోసం ఎంతో మంది సార్ట్ దర్శకులు కథలు సిద్ధం చేయగా, మరికొంత మంది బడా నిర్మాతలు తమ బ్యానర్ లోనే పరిచయం చేయాలనీ ముందుకొచ్చారు. కానీ బాలకృష్ణ మాత్రం గత కొంతకాలంగా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని అంటూనే వాయిదా వేస్తూ వచ్చారు. కథలు నచ్చకో, ఇంకాస్త సమయం తీసుకుందామని అనుకున్నారో ఏమో గాని మోక్షజ్ఞ సినీ ఎంట్రీ అయితే వచ్చే ఏడాది పక్కాగా ఉంటుందని తెలుస్తుంది.

Nandarmoori Tejaswini is going to produce the film of Nandarmoori Mokshagna

మోక్షజ్ఞని పరిచయం చేస్తున్న స్టార్ దర్శకుడు..

ఇకపోతే మోక్షజ్ఞ (Nandarmoori Mokshagna) ని పరిచయం చేసే బాధ్యత దర్శకుడు బోయపాటి శ్రీను, లేదా పూరి జగన్నాథ్ తీసుకున్నారని వాళ్లలో ఎవరో ఒకరు మోక్షజ్ఞని పరిచయం చేస్తారని వార్తలు వచ్చాయి. పైగా బోయపాటి నందమూరి బాలయ్యకు అత్యంత సన్నిహితుడు కాబట్టి తన దర్శకత్వంలోనే సినిమా ఉంటుందని అనుకున్నారు అందరూ. కానీ మోక్షజ్ఞ ఫీల్మ్ ఎంట్రీ కి యంగ్ డైరెక్టర్ దర్శకత్వంలో ఉంటుందని తెలుస్తుంది. నందమూరి మోక్షజ్ఞ ని ప్రముఖ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పరిచయం చేయనున్నాడని తెలుస్తుంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ని సాధించిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ దీనిపై అధికారిక ప్రకటన రానుంది. అయితే మోక్షజ్ఞ ని ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్ లో కాకుండా వేరే జోనర్ లో తీసే అవకాశం ఉంది.

- Advertisement -

నిర్మాత నందమూరి ఫ్యామిలీ నుండే…

అయితే మోక్షజ్ఞ హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేయబోయే సినిమాను ఎవరు ప్రొడ్యూస్ చేస్తారా అన్న వార్త కూడా ఆసక్తి గా మారగా, వైజయంతి మూవీస్ బ్యానర్ అని ఒకరు, దిల్ రాజు బ్యానర్ లోనే అని, ఇక బాలయ్య తో సినిమా తీసిన ఒక టాప్ ప్రొడ్యూసర్ అని వార్తలు వచ్చాయి. కానీ లేటెస్ట్ అప్డేట్ ప్రకారం మోక్షజ్ఞ ని నందమూరి ఫ్యామిలీ నిర్మాతలే పరిచయం చేయబోతున్నారట. అయితే కళ్యాణ్ రామ్ ఆర్ట్స్ పై మాత్రం కాదు. మోక్షజ్ఞ ని పరిచయం చేయబోయేది స్వయానా తన సోదరి తేజస్విని. అవును… లేటెస్ట్ అప్డేట్ ప్రకారం బాలయ్య చిన్న కూతురు నందమూరి తేజస్విని తన తమ్ముడిని నిర్మాతగా మారి పరిచయం చేయబోతుందట. ఆగష్టు లో సినిమాని ప్రారంభించి వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తారట. ఇక ఈ వార్తల గురించి బాలకృష్ణ ఫ్యామిలీ నుండే క్లారిటీ రావాల్సి ఉంటుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు