Dhanush: నెక్స్ట్ బాలీవుడ్ బ్యూటీ తో రొమాన్స్ చేయనున్న ధనుష్

Dhanush: ప్రస్తుత కాలంలో తెలుగు సినిమా తమిళ్ సినిమా మలయాళం సినిమాని కాకుండా అందరూ కూడా సౌత్ సినిమా అని మాట్లాడటం మొదలు పెడుతూ ఉన్నారు. ఎందుకంటే భాషతో సంబంధం లేకుండా మిగతా ఇండస్ట్రీకి సంబంధించిన హీరోలు కూడా ఇతర భాషల్లో వర్క్ చేస్తున్నారు. చాలామంది తమిళ్ హీరోలు ఇప్పటికే తెలుగు దర్శకులతో పనిచేయడానికి సిద్ధమవుతున్నారు. మలయాళం హీరోలు కూడా తెలుగు దర్శకులతో చేయడానికి ఇష్టపడుతున్నారు.

తమిళ్ లో ఉన్న స్టార్ హీరోస్ లో ధనుష్ ఒకరు. ధనుష్ గురించి ప్రత్యేకంగా కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు చేశాడు ధనుష్. కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడుగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. ధనుష్ చేసిన ఎన్నో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచాయి. ఇక రీసెంట్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సార్ అనే సినిమా చేసి తెలుగు ప్రేక్షకులకు కూడా మరింత దగ్గర అయ్యాడు ధనుష్.

ఇక ప్రస్తుతం ధనుష్ దర్శకుడుగా కూడా ఒక సినిమాను చేస్తున్నాడు ఆ సినిమా పేరు రాయాన్. ఈ సినిమా జులై 26న రిలీజ్ కి సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో తెలుగు హీరో సందీప్ కిషన్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నాడు. అలానే తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో కుబేర అనే ఒక సినిమాను కూడా చేస్తున్నాడు ధనుష్. ఇక ఈ సినిమా తర్వాత ధనుష్ చేయబోయే సినిమా గురించి ఒక అప్డేట్ వినిపిస్తుంది.

- Advertisement -

Tripti Dimri

ఆనంద్ రాయి దర్శకత్వంలో తన మూడవ సినిమాను చేయనున్నాడు ధనుష్. ఈ సినిమాలో ధనుష్ సరసన బాలీవుడ్ బ్యూటీ త్రిప్తి దిమిరి నటిస్తోంది. ఈ సినిమా అక్టోబర్లో మొదలుకానున్నట్లు తెలుస్తుంది. ఉత్తర ప్రదేశ్ వారణాసి లో ఈ సినిమా షూటింగ్ను రెండు నెలల పాటు షూట్ చేయనున్నారు. ఇక ధనుష్ ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ పైన చాలామంది క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్నారు. అనిమల్ సినిమాతో మంచి పేరు తెచ్చుకున్న త్రిప్తి వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు