Filmfare Awards 2023 Telugu : 2023 ఫిల్మ్ ఫేర్ అవార్డుల వినర్స్ లిస్ట్… బెస్ట్ యాక్టర్ ఎవరో తెలుసా?

Filmfare Awards 2023 Telugu : టాలీవుడ్ లో 68వ ఫిల్మ్ ఫేర్ అవార్డులను లేటెస్ట్ గా ప్రకటించడం జరిగింది. 2022 సంవత్సరానికి గాను 2023 లో ప్రకటించాల్సిన ఫిల్మ్ ఫేర్ అవార్డు కాస్త ఆలస్యంగా ప్రకటించడం జరిగగా, కాస్త లేట్ అయినా ఎట్టకేలకు ఫిల్మ్ ఫేర్ అవార్డులను ప్రకటించడం జరిగింది. ఇక అవార్డులలో అందరూ ఊహించినట్టే RRR సినిమాకి ఎక్కువగా 7 విభాగాల్లో అవార్డులు సొంతం కాగా సీతారామం, విరాట పర్వం చిత్రాలు సత్తా చాటాయి. ఇక ప్రకటించిన అవార్డులలో అందరి దృష్టి ఉత్తమ నటుడు అవార్డుని ఎవరికీ ఇస్తారా అని ఉత్కంఠగా ఎదురుచూడగా, వివాదాలకు తావునివ్వకుండా RRR సినిమాకి గానూ ఉత్తమ నటుడు విభాగంలో, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు ఇద్దరూ విజేతలుగా నిలిచారు. అలాగే ఉత్తమ నటిగా సీతారామం చిత్రం నుండి మృణాల్ ఠాకూర్ నిలిచింది. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రానికి గానూ ఉత్తమ దర్శకుడిగా ఎస్.ఎస్. రాజమౌళి నిలిచారు. ఇక ఇతర అన్ని విభాగాల్లో ఫిల్మ్ ఫేర్ అవార్డులు అందుకున్న వారు ఎవరో గమనిస్తే.. ఫిల్మిఫై కి అందిన సమాచారం ప్రకారం విజేతల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

Filmfare Awards 2023 Telugu Winners List

(Filmfare Awards 2023 Telugu) 2023 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ తెలుగు విజేతలు..

- Advertisement -

ఉత్తమ చిత్రం : RRR

ఉత్తమ దర్శకుడు : S. S. రాజమౌళి (RRR)

ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) : సీతా రామం (హను రాఘవపూడి)

ఉత్తమ నటుడు (Male) : రామ్ చరణ్ (RRR), జూనియర్ ఎన్టీఆర్ (RRR)

ఉత్తమ నటుడు (క్రిటిక్స్) : దుల్కర్ సల్మాన్ (సీతా రామం)

ఉత్తమ నటి (Female) : మృణాల్ ఠాకూర్ (సీతా రామం)

ఉత్తమ నటి (క్రిటిక్స్) : సాయి పల్లవి (విరాట పర్వం)

ఉత్తమ సహాయ నటుడు (Male) : రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)

ఉత్తమ సహాయ నటి (Female) : నందితా దాస్ (విరాట పర్వం)

ఉత్తమ సంగీత దర్శకుడు : M. M. కీరవాణి (RRR)

ఉత్తమ పాటల రచయిత : సిరివెన్నెల సీతారామ శాస్త్రి – కానున్న కళ్యాణం (సీతా రామం)

ఉత్తమ నేపథ్య గాయకుడు : (Male) కాల భైరవ – కొమురం భీముడో (RRR)

ఉత్తమ నేపథ్య గాయని (Female) : చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ- సీతారామం)

ఉత్తమ కొరియోగ్రఫీ : ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు- RRR)

ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్ : సాబు సిరిల్ (RRR)

ఇక ఇందులో RRR చిత్రానికి అత్యధికంగా 7 విభాగాల్లో అవార్డులు లభించగా, సీతారామం చిత్రానికి 4 విభాగాల్లో అవార్డులు లభించాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు