Maharaja: రాజా వారు ఓటిటి ఎంట్రీ ఇచ్చారు

Maharaja: మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ముందుగా తమిళ్ సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు వేస్తూ పిజ్జా అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఆ తర్వాత వరుసగా కాన్సెప్ట్ సినిమాలు చేస్తూ చాలామంది ప్రేక్షకులకు దగ్గరయిపోయాడు. ఈ ప్రాసెస్లో తెలుగు ప్రేక్షకులు కూడా విజయ్ సేతుపతి టాలెంట్ను గుర్తించడం మొదలుపెట్టారు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో ఒక కీలక పాత్రలో కనిపించి తెలుగులో ఎంట్రీ ఇచ్చాడు విజయ్ సేతుపతి.

ఆ తర్వాత బుచ్చిబాబు దర్శకత్వం వహించిన ఉప్పెన సినిమాలో కృతి శెట్టి ఫాదర్ గా రాయణం అనే పాత్రలో కనిపించాడు. ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయం సాధించి దాదాపు 100 కోట్లకు పైగా వసూలు చేసింది. ఈ సినిమాతోనే వైష్ణవ తేజ్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. అలానే కృతి శెట్టి కూడా ఈ సినిమాతోనే ఎంట్రీ ఇచ్చింది. ఇక ప్రస్తుతం విజయ్ సేతుపతి తమిళ్ లో ఏ సినిమా చేసినా కూడా తెలుగులో డబ్బింగ్ అవుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా మహారాజా అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించాడు విజయ్ సేతుపతి.

Maharaja

- Advertisement -

మహారాజ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సాధించింది. మౌత్ టాక్ తో ఈ సినిమా మంచి విజయాన్ని సాధించి చాలామంది ప్రేక్షకులకు రీచ్ అయింది ఇకపోతే ఎట్టకేలకు ఈ సినిమా ఓటీటిలోకి స్ట్రీమింగ్ కు వచ్చింది ప్రముఖ ఓటీటి సంస్థ అయిన నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా పాన్ ఇండియా భాషల్లో అందుబాటులోకి వచ్చేసింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు