HBD Shivaraj Kumar : ఒకేసారి సెట్స్ పై నాలుగు సినిమాలు..శివన్న మాస్ లైనప్…

HBD Shivaraj Kumar : కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలోనే ఆడియన్స్ కి సుపరిచితులైనా, కన్నడ నాట మూడున్నర దశాబ్దాలుగా అగ్ర హీరోలలో ఒకడిగా నిలుస్తున్నాడు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ తనయుడిగా, పునీత్ రాజ్ కుమార్ అన్నయ్యగా శివన్న గా కన్నడ అభిమానులని తన సినిమాలతో అలరిస్తున్న శివరాజ్ కుమార్ ఇప్పుడు పాన్ ఇండియా వైడ్ గా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. క రీసెంట్ గా లాస్ట్ ఇయర్ రజినీకాంత్ జైలర్ లో ఒక పవర్ ఫుల్ రోల్ లో గెస్ట్ అప్పీరెన్స్ కూడా ఇచ్చారు శివన్న. ఓ ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శివరాజ్ కుమార్ ఇప్పుడు వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ఇప్పుడు ఏకంగా ఒకేసారి 4 సినిమాలను లైన్లో పెట్టడం విశేషం. జులై 12న శివరాజ్ కుమార్ బర్త్ డే (HBD Shivaraj Kumar) సందర్బంగా ఏకంగా నాలుగు సినిమాల అనౌన్స్ మెంట్ జరిగింది.

HBD Sivaraj Kumar Movies Crazy lineup

నాలుగు సినిమాలు లైన్లో పెట్టిన శివన్న..

కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ చివరగా ఏడాది కింద ఘోస్ట్ అనే సినిమాతో అభిమానులను పలకరించగా, ఆ తర్వాత జైలర్ సినిమాలో గెస్ట్ అప్పీరెన్స్ ఇచ్చారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో అభిమానులని అలరించబోతున్నారు. ప్రస్తుతం కన్నడలో భాయ్రతి రణగల్ అనే సినిమాలో నటిస్తున్న శివరాజ్ కుమార్ ఆగష్టు 15న విడుదలకు సిద్ధం అవుతుంది. ఈ సినిమా శివరాజ్ కుమార్ నటించిన బ్లాక్ బస్టర్ ‘మఫ్తి’ సినిమాకు ఫ్రీక్వెల్ గా తెరకెక్కింది. ఆ తర్వాత ఉత్తరకాండ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. అలాగే రీసెంట్ గా ‘భైరవకొనే పాఠ’ అంటూ మరో సినిమా అనౌన్స్ మెంట్ జరిగింది. రీసెంట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ కాగా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇదిలా ఉండగా మరో సినిమా అనౌన్స్ మెంట్ అఫిషియల్ గా జరిగింది.

- Advertisement -

RC16 లో శివన్న అఫిషియల్…

ఇక లేటెస్ట్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న RC16 లో ముఖ్యపాత్రలో శివరాజ్ కుమార్ నటిస్తున్నట్టు మేకర్స్ నేడు అఫిషియల్ గా కంఫర్మ్ చేసారు. ఈ సినిమాలో శివన్న నటిస్తున్నట్టు చాలా రోజుల నుండే వార్తలు వస్తుండగా, నేడు మేకర్స్ అఫిషియల్ గా కంఫర్మ్ చేసారు. ఇక ఎనిమిదేళ్ల కింద గౌతమి పుత్ర శాతకర్ణి లో శివన్న స్పెషల్ సాంగ్ చేయగా, ఇన్నాళ్లకు మళ్ళీ తెలుగు సినిమాలో నటిస్తుండడం విశేషం. ఇక బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కనున్న RC16 ఆగష్టు లో మొదలుకానుంది. ఇక శివరాజ్ కుమార్ ప్రస్తుతం తన కన్నడ సినిమాల షూటింగ్ లో బిజీగా ఉండగా త్వరలోనే బుచ్చిబాబు సినిమా సెట్స్ లో అడుగుపెట్టనున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు