Ram Charan – Upasana:ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకునే వారో తెలుసా…

Ram Charan – Upasana: ఇండస్ట్రీలో క్యూట్ కపుల్ గా గుర్తింపు తెచ్చుకున్న జంటలలో రామ్ చరణ్, ఉపాసన జంట కూడా ఒకటి.. దాదాపు 11 సంవత్సరాల పాటు ప్రేమించుకున్న వీరు ఆ తర్వాత పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. సినీ ఇండస్ట్రీలో అత్యంత ఘనంగా జరిగిన వివాహాలలో వీరిది కూడా ఒకటి. పుట్టుకతోనే వీరిద్దరూ గోల్డెన్ స్పూన్ తో పుట్టారు.. వేలకోట్ల రూపాయలను ఆస్తులుగా పొందారు.. ఇలాంటి రిచ్ కిడ్స్ ప్రేమికులుగా ఉన్నప్పుడు ఎంతటి విలువైన బహుమతులను ఇచ్చుకున్నారో తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారు.

Ram Charan - Upasana: Do you know what kind of gifts people give when they are lovers...
Ram Charan – Upasana: Do you know what kind of gifts people give when they are lovers…

ప్రేమికులుగా ఉన్నప్పుడు అలాంటి గిఫ్ట్స్ ఇచ్చుకున్న ఉపాసన – రామ్ చరణ్.

ఇదిలా ఉండగా రామ్ చరణ్ , ఉపాసన ప్రేమికులుగా ఉన్నప్పుడు చోటు చేసుకున్న కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. కాలేజ్ డేస్ లో ఉపాసన, రాంచరణ్ మధ్య పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య స్నేహం కుదిరింది.. మిత్రులుగా ఉన్న వీరి మధ్య గొడవలు కూడా చోటు చేసుకున్నాయట. ఏళ్లు గడిచే కొద్దీ ఆ స్నేహం ప్రేమగా మారింది. ఇక వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్న వారసులు కాబట్టి ఉపాసన – రాంచరణ్ ఖరీదైన బహుమతులను ఇచ్చుకునే వారు అంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే.. ఇక చాలా చీప్ గిఫ్ట్స్ ఇచ్చుకునే వారట..అందరిలాగే స్లిప్పర్స్, టెడ్డీబేర్, కాఫీ మగ్ లాంటివి బహుమతులుగా ఒకరి ఒకరు ఇచ్చుకునే వారట.. బహుమతి అనేది ఒక జ్ఞాపకం అని.. దానిని డబ్బుతో వెలకట్టలేమని ఇద్దరు నమ్మేవారట.. ఇక ఈ విషయం తెలిసిన తర్వాత మనం మైండ్ సెట్ కూడా మారిపోతుంది.. గొప్పవారు కూడా చాలా చిన్న బహుమతులకు సంతృప్తి చెందారు అంటే బహుమతి విలువ ఎంతో అర్థం చేసుకోవాలి అంటూ పలువురు నెటిజెన్లు కామెంట్లు చేస్తున్నారు.. ఏది ఏమైనా రాంచరణ్ ,ఉపాసనలు ప్రేమించుకున్నప్పుడు అందరి లాగే సాదాసీదా గిఫ్ట్లు ఒకరికొకరు ఇచ్చుకున్నట్లు సమాచారం.

రామ్ చరణ్ కెరియర్…

ముందుగా రామ్ చరణ్ విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రామ్ చరణ్.. ఇప్పుడు టాప్ స్టార్స్ లో ఒకరిగా స్థానం సంపాదించుకున్నారు. సినిమా సినిమాకు తన రేంజ్ పెంచుకుంటూ పోతున్న ఈయన ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా ప్రపంచ స్థాయి గుర్తింపును సొంతం చేసుకున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

ఉపాసన కెరియర్..

మరోవైపు ఉపాసన.. అపోలో హాస్పిటల్ అధినేత ప్రతాప్ రెడ్డి మనవరాలు. పైగా అపోలో హాస్పిటల్స్ కి గ్రూప్ చైర్ పర్సన్ కూడా.. ఇక తనదైన రంగంలో దూసుకుపోతూ సక్సెస్ఫుల్ బిజినెస్ ఉమెన్ గా పేరు తెచ్చుకున్న ఈమె సంపాదించిన డబ్బుతో సేవా కార్యక్రమాలు కూడా మొదలుపెట్టి.. ఎంతోమందికి అండగా ఆదర్శంగా నిలుస్తోంది.

అనుమానాలు , అపోహాల తర్వాత పండంటి బిడ్డకు జననం..

అలాంటి ఈ ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు.. 2012లో రామ్ చరణ్ – ఉపాసన ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.. ఇక ఫ్యామిలీ ప్లానింగ్ చేయలేదు.. అందుకే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు..ముఖ్యంగా మెగా కోడలు ఉపాసన అవమానాలు , అపోహలు ఎన్నో ఎదుర్కోవాల్సి వచ్చింది. పెళ్లి జరిగినప్పుడే రామ్ చరణ్ – ఉపాసన మధ్య ఒప్పందం కుదిరిందట.. పదేళ్ల వరకు పిల్లలు కడకూడదు అనుకున్నారట.. ఇక అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ 2023 జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వగా లలితా సహస్రనామం నుండి క్లీంకారా అనే పేరుని తీసుకొని పాపకు నామకరణం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు