Couple Friendly Glimpse : ఆకట్టుకుంటున్న సంతోష్ శోభన్ బర్త్ డే గ్లింప్స్…

Couple Friendly Glimpse : టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సంతోష్ శోభన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రముఖ దర్శకుడు సంతోష్ కొడుకుగా ఇండస్ట్రీకి బ్యాక్ గ్రౌండ్ తోనే ఎంట్రీ ఇచ్చాడు. తను నేను అనే చిన్న సినిమాతో హీరోగా పరిచయమైన ఈ హీరో, పేపర్ బాయ్ సినిమాతో హీరోగా మంచి సక్సెస్ తో పాటు గుర్తింపును పొందాడు. ఇక ఆ తర్వాత రొటీన్ కి భిన్నమైన కథలతో ప్రేక్షకులని అలరించాడు. ఏక్ మినీ కథ, మంచి రోజులొచ్చాయి వంటి సినిమాలతో ఆడియన్స్ ని మెప్పించగా, ఆ తరవాత సక్సెస్ ని కంటిన్యూ చేయలేకపోయాడు. లైక్ షేర్ సబ్స్క్రయిబ్, కళ్యాణ్ వైభోగమే, అన్ని మంచి శకునములే, ప్రేమ్ కుమార్ వంటి వరుస పరాజయాలతో డౌన్ అయ్యాడు. ఇక ఇప్పుడైనా మంచి కాన్సెప్ట్ తో ప్రేక్షకులను మెప్పించాలని జాగ్రత్తపడుతున్నాడు. తాజాగా సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా గ్లింప్స్ ని తాజాగా రిలీజ్ చేయడం జరిగింది.

Santosh Sobhan Couple Friendly Movie Glimpse Out Now

ఆకట్టుకుంటున్న కపుల్ ఫ్రెండ్లీ గ్లిమ్స్…

సంతోష్ శోభన్ హీరోగా ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో యూవీ కాన్సెప్ట్స్ వారు నిర్మిస్తున్న కొత్త సినిమా ‘కపుల్ ఫ్రెండ్లీ. తాజాగా ఈ సినిమా గ్లింప్స్ ని సంతోష్ శోభన్ బర్త్ డే స్పెషల్ గా కాసేపటికిందే రిలీజ్ చేయడం జరిగింది. గత కొన్ని రోజుల నుండి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకి సంబంధించి టైటిల్, ఇంకా ఫస్ట్ లుక్ ని బర్త్ డే స్పెషల్ గా రిలీజ్ చేసారు మేకర్స్. ఒక ఫీల్ లవ్ & రొమాంటిక్ ఎంట‌ర్టైన‌ర్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ‘క‌పుల్ ఫ్రెండ్లీ’ (Couple Friendly Glimpse) అనే క్యాచీ టైటిల్ ని ఫిక్స్ చేయగా, టైటిల్ తోనే ఆడియన్స్ ని ఇంప్రెస్స్ చేసారని చెప్పాలి. ఇక ఈ సినిమాలో మిస్ ఇండియా అయిన ‘మాన‌స వార‌ణాసి’ అనే అమ్మాయి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే విడుదల చేసిన టీజర్ లో హీరోయిన్ ని ఇతర నటీనటుల్ని రివీల్ చేయకుండా సంతోష్ శోభన్ ని మాత్రమే చూపించారు.

- Advertisement -

వాలెంటైన్స్ డే కి కపుల్ ఫ్రెండ్లీ..

ఇక కపుల్ ఫ్రెండ్లీ ఈ సినిమాను అశ్విన్ చంద్ర‌శేఖ‌ర్ డైరెక్ట్ చేస్తున్నాడు. కాగా టీజర్ ని చూస్తుంటే ఫ్రెష్ ఫీలింగ్ తో ఒక ఫీల్ గుడ్ మూవీ చూడబోతున్నాము అనే ఫీలింగ్ ఆడియన్స్ కి కలిగిస్తుంది. ఇక ఈ సినిమాకు అజ‌య్ కుమార్.పి కో ప్రొడ్యూస‌ర్ గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కపుల్ ఫ్రెండ్లీ సినిమా చెన్నై బ్యాక్ డ్రాప్ లో సాగే క‌థ‌గా తెరకెక్కుతున్నట్టు సమాచారం. ఇక ఈ సినిమాను నెక్స్ట్ ఇయర్ ఫిబ్ర‌వ‌రి 14న వాలెంటైన్స్ డే కానుక‌గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తునట్టు సమాచారం. మరి వరుస ప్లాపులతో సతమతమవుతున్న సంతోష్ శోభన్ కపుల్ ఫ్రెండ్లీ సినిమాతోనైనా సక్సెస్ అందుకుని ట్రాక్ లో పెడతాడేమో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు