Ester Noronha: టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో కొంతమంది ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ సక్సెస్ అయిన వారు …. అదే క్రమంలో అతి తక్కువ సమయంలోనే మళ్ళీ కనిపించకుండా పోయిన హీరోయిన్లు ఎందరో ఉన్నారు. అలాంటి హీరోయిన్లలో ఎస్తార్ ఒకరు. ఈ బ్యూటీ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ బ్యూటీ భీమవరం బుల్లోడు, గరం, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ వంటి సినిమాలలో హీరోయిన్గా నటించి ప్రతి ఒక్క ప్రేక్షకులను అలరించింది.
ఆ తర్వాత ఈ బ్యూటీకి పెద్దగా సినిమా అవకాశాలు రాకపోవడంతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా పనిచేస్తుంది. ఇక ఆదే సమయంలో బిగ్బాస్ ఫ్రేమ్ నోయల్ ను ప్రేమించి వివాహం చేసుకుంది. అతి తక్కువ సమయంలోనే ఈ జంట కొన్ని అనివార్య కారణాలతో విడిపోతున్నట్టు ప్రకటించారు. ఇదిలా ఉండగా …..తాజాగా ఈ బ్యూటీ క్యాస్టింగ్ కౌచ్ పై సంచలన వాక్యాలు చేసింది. మహిళలపై ప్రతి చోట్ల జరుగుతున్న వేధింపుల గురించి మాట్లాడుతూ…. ప్రతి చోటా మహిళలకు వేధింపులు ఎదురవుతున్నాయి.
కానీ ఇండస్ట్రీలో ఇది కాస్త ఎక్కువగా ఉంటుందని… ఇండస్ట్రీలో ప్రతి ఒక్క అమ్మాయి తొందరగా ఎదగాలనే కోరికతో ఏ పని చేయడానికి అయినా సిద్ధపడతారు. తొందరగా పైకి రావాలని …..మంచి గుర్తింపు రావాలని తపన ప్రతి ఒక్క అమ్మాయిలో ఉంటుంది. ఇండస్ట్రీలో మహిళలపై వేధింపులు ఎక్కువగా జరుగుతాయని…. అవకాశాల కోసం నీవు ఏం చేయగలవు అని అడిగేవాళ్లు ….అడ్వాంటేజ్ తీసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు.
నేను అలా చేయను…..నా దారిలో నేను వెళతాను…. అని అనుకునే వారిని ఎవ్వరూ బలవంత పెట్టారు. మనం అడ్వాంటేజ్ ఇస్తేనే వారు రెచ్చిపోతారు. మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ ఛాయిస్ మనకే ఉంటుంది. నా వరకు నేను టాలెంట్, హార్డ్ వర్క్ ను నమ్ముకున్నానని ఇస్తార్ చెప్పారు. నా టాలెంట్ ద్వారా వచ్చే గుర్తింపుని నేను కోరుకుంటాను అని సంచలన వాక్యాలు చేశారు. ప్రస్తుతం ఈ కామెంట్స్ సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.