Vanitha Vijay Kumar: రమ్యకృష్ణతో గొడవ.. అసలు విషయం చెప్పిన వనిత..!

Vanitha Vijay Kumar.. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన వనిత విజయ్ కుమార్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. ఆమె ఎక్కడ ఉంటుందో అక్కడ వివాదాలకు లోటు ఉండదు అని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే పలు రకాలుగా విమర్శలు ఎదుర్కొంటూ ఉంటుంది.. ఇకపోతే ఇటీవల రమ్యకృష్ణ తో ఈమె గొడవ పడిన విషయం అప్పట్లో సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే .. తాజాగా దీని గురించి స్పందించింది అనిత విజయ్ కుమార్.

Vanitha Vijay Kumar: Argument with Ramyakrishna.. Vanitha who told the real thing..!
Vanitha Vijay Kumar: Argument with Ramyakrishna.. Vanitha who told the real thing..!

వనిత విజయ్ కుమార్ పెళ్లిళ్లు..

తెలుగు , తమిళ్ భాషలలో సినిమాలు చేసిన ఈమె టీనేజ్ లోనే సౌత్ యాక్టర్ విజయ్ కుమార్ కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి పలు చిత్రాలలో నటించింది.. కెరియర్ బాగుంది అనుకున్నప్పుడే పెళ్లి చేసుకుంది.. దానివల్ల సినిమా అవకాశాలు రాలేదు. ఆ తర్వాత అతడితో విడాకులు తీసుకొని రెండో పెళ్లి చేసుకుంది. అది కూడా కాదని విడాకులు తీసుకొని మళ్ళీ మూడో పెళ్లి చేసుకుంది.. అలా ఏకంగా మూడుసార్లు పెళ్లిళ్లు చేసుకుని వార్తల్లో నిలిచింది ఈ ముద్దుగుమ్మ. అందుకే వనిత గురించి తెలిసిన వారు.. ఎవరైనా సరే ఆమె జోలికి వెళ్లాలని అనుకోరు..

రమ్యకృష్ణ తో గొడవ..

ఇదిలా ఉండగా ఒక రియాల్టీ షోలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కి వనిత విజయ్ కుమార్ కి మధ్య గొడవ జరిగింది.. ఒక రియాల్టీ డాన్స్ షోలో..వనిత విజయ్ కుమార్ అమ్మవారి గెటప్ లో డాన్స్ చేసిన ఎపిసోడ్ కి జడ్జిగా వచ్చిన రమ్యకృష్ణ.. వనిత యాక్టింగ్ పట్ల కాస్త నెగిటివ్ కామెంట్లు ఇచ్చింది.. అంతేకాదు వనితను వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడింది.. ఈమె చేస్తున్న వ్యవహారాల వల్ల ఫ్యామిలీ కూడా వనిత విజయ్ కుమార్ ని దూరం పెట్టింది.. అయితే దాన్ని సహించలేని వనిత రమ్యకృష్ణ జడ్జిమెంట్ కు హర్ట్ అయ్యి షో నుంచి వెళ్ళిపోయింది.. ఆ తర్వాత జరిగిన ఒక ఇంటర్వ్యూలో వనిత ఆ ఇన్సిడెంట్ గురించి చెబుతూ రమ్యకృష్ణతో గొడవ పై క్లారిటీ ఇచ్చింది.

- Advertisement -

గొడవ పై క్లారిటీ..

వనిత విజయ్ కుమార్ మాట్లాడుతూ.. రమ్యకృష్ణతో నాకు చిన్నప్పటి నుంచి పరిచయం వుంది.. ఆమె గొప్ప నటి ..కాకపోతే ఆరోజు షోలో నన్ను వేరే వాళ్ళతో పోల్చి మాట్లాడటం వల్ల అలా చేయాల్సి వచ్చింది అంటూ చెప్పుకొచ్చింది. నటిగా ఎప్పుడు రమ్యకృష్ణ అంటే ఇష్టం అని ..కేవలం ఆ సందర్భంలో ఆమె మాటలు తనను హార్ట్ చేశాయని.. అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయాను అని క్లారిటీ ఇచ్చింది వనిత విజయ్ కుమార్.. ఇకపోతే ఆ తర్వాత ఆమెను కలిసే సందర్భం రాలేదని.. ఆ విషయం గురించి తాను అప్పుడే వదిలేసాను అని కూడా తెలిపింది.. ఇలానే విజయ్ కుమార్ కొన్ని షోలకి జడ్జిగా వెళ్లి అక్కడ కూడా తన కామెంట్స్ తో వార్తల్లో నిలిచింది. మొత్తానికైతే రమ్యకృష్ణతో గొడవ పై క్లారిటీ ఇచ్చింది వనిత విజయ్ కుమార్.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు