Director Shankar : ఇద్దరిదీ ఒకే స్థితి – ఏమిటీ పరిస్థితి… శంకర్‌, రాజ్ కుమార్ హిరానీకి సెట్ అయ్యే సాంగ్ ఇది

Director Shankar : ఇండియన్ సినిమా దర్శకులలో శంకర్, రాజ్ కుమార్ హిరానీ వీరిద్దరికి ఉన్న ప్రత్యేకత వేరు. వీళ్ళ సినిమాలు కోసం ఆడియన్స్ ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళ కెరియర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలో ఉన్నాయి. శంకర్ సినిమాలు అటు తమిళ్ ఆడియన్స్ తో పాటు తెలుగు ఆడియన్స్ కూడా విపరీతంగా చూసేవారు. శంకర్ తమిళ్లో తెరకెక్కించిన ప్రతి సినిమా తెలుగులో డబ్బింగ్ అయ్యేవి. అలానే తెలుగు ప్రేక్షకుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక మంచి సినిమా ఏ భాషలో ఉన్నా కూడా దానిని చూసి ఎంకరేజ్ చేయటం తెలుగు ప్రేక్షకులకు అలవాటుగా మారింది.

కొన్నిసార్లు భాష అర్థం కాకపోయినా కూడా సబ్ టైటిల్స్ తో సినిమాలు చూసి ఆయా దర్శకులను ప్రైస్ చేసే ప్రేక్షకులు ఉన్నారని చెప్పొచ్చు. అలానే బాలీవుడ్ దర్శకుడు రాజ్ కుమార్ హిరానీ సినిమాలను చాలామంది తెలుగు ప్రేక్షకులు చూసి ఎంజాయ్ చేశారు. హిరానీ సినిమా అంటేనే ఒక రకమైన క్యూరియాసిటీ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి నటించిన శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమా ఎంత అద్భుతమైన ఘనవిజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అదే సినిమాను ఒరిజినల్ గా మున్నాభాయ్ ఎంబిబిఎస్ అని బాలీవుడ్ లో తెరకెక్కించాడు హిరానీ.

రాజ్ కుమార్ ఇరానీ కాన్సెప్ట్ ఎప్పుడు కూడా ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ అనే ఫార్ములాతో ఉంటాయి. అంటే మనది కానీ ప్రపంచంలో మనం బతకటం. ఇక మున్నాభాయ్ ఎంబిబిఎస్ సినిమాకు వస్తే ఒక దాదా వచ్చి కాలేజీలో స్టూడెంట్ గా మారడం. ఒక స్పేస్ నుంచి ఒక వ్యక్తి వచ్చి భూమ్మీద బతకడం ఇలా ఫిష్ అవుట్ ఆఫ్ ది వాటర్ కాన్సెప్ట్ ఉంటాయి. శంకర్ కాన్సెప్ట్లు ఎంత డిఫరెంట్ గా ఉంటాయో రాజ్ కుమార్ కాన్సెప్ట్లు కూడా అంతే డిఫరెంట్ గా ఉంటాయి అని చెప్పొచ్చు. ఒక సందర్భంలో రాజకుమార్ హిరానీ తెరకెక్కించిన త్రీ ఇడియట్ సినిమాను రీమేక్ చేశాడు శంకర్.

- Advertisement -

Rajkumar Hirani

ఇకపోతే ఈ ఇద్దరు దర్శకులు పరిస్థితి ఇప్పుడు ఒకేలా మారింది. రీసెంట్ గా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన డంకి సినిమా ఊహించిన స్థాయిలో బాక్స్ ఆఫీస్ వద్ద విజయాన్ని సాధించలేకపోయింది. ఇక భారతీయుడు వంటి హిట్ సినిమాకి సీక్వెల్ గా తెరకెక్కించిన భారతీయుడు 2 సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించిన విజయాన్ని సాధించలేకపోయింది. ఒకప్పుడు డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమాలతో ఇండియన్ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచిన ఈ ఇద్దరు దర్శకులు ఇప్పుడు నిరుత్సాహపరుస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు