Naa Saami Ranga OTT Alert : నా సామి రంగ హిందీ వెర్షన్ ఓటిటి రిలీజ్ డేట్ ఫిక్స్

Naa Saami Ranga OTT Alert : టాలీవుడ్ మన్మధుడు అక్కినేని నాగార్జున ప్రస్తుతం ధనుష్‌తో కలిసి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కుబేరలో కీలక పాత్రలో కనిపించనున్నారు. కాగా నాగార్జున చివరిసారిగా పెద్ద స్క్రీన్‌లో కనిపించిన చిత్రం నా సామి రంగా. తాజాగా ఈ మూవీ హిందీ వెర్షన్ ఓటీటీ రిలీజ్ డేట్ కు ముహూర్తం ఫిక్స్ అయ్యింది.

ఇప్పటికే మూడు భాషల్లో..

నా సామిరంగ సినిమాలో అల్లరి నరేష్, ఆషికా రంగనాథ్, మిర్నా మీనన్, రాజ్ తరుణ్, నాజర్, షబీర్ కల్లరక్కల్, రుక్సార్ ధిల్లాన్ కీ రోల్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకత్వం వహించారు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చుట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఆస్కార్ అవార్డు గ్రహీత కీరవాణి స్వరాలు సమకూర్చారు. నా సామిరంగ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 14న థియేటర్లలోకి వచ్చి హిట్ అయింది. విలేజ్ బ్యాక్‍డ్రాప్‍లో యాక్షన్‍తో పాటు ఎంటర్‌టైన్‍మెంట్‍తో అలరించింది. ఈ ఏడాది సంక్రాంతికి దాదాపు నాలుగైదు సినిమాలు బరిలోకి దిగగా హనుమాన్ సినిమాతో పాటు నా సామి రంగ కూడా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది.

Naa Saami Ranga' title track: Nagarjuna starrer to kick off with MM  Keeravani's vibrant music treat | Telugu Movie News - Times of India

- Advertisement -

థియేటర్లలో సూపర్ హిట్ టాక్ తో వారంలోపే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను చేరుకున్న ఈ సినిమా నెల కాగానే ఓటీటీలో కూడా సందడి చేసింది. అక్కడ కూడా ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీకి మంచి రెస్పాన్స్ దక్కింది. నా సామిరంగ సినిమా డిస్నీ+ హాట్‍స్టార్ ఫిబ్రవరి 17 నుంచి స్ట్రీమింగ్‍ అవుతోంది. హాట్‍స్టార్ ప్లాట్‍ఫామ్‍లో తెలుగుతో పాటు తమిళం, కన్నడలోనూ నా సామిరంగ సినిమా స్ట్రీమింగ్‍కు వచ్చింది. ఇప్పుడు కిట్టయ్య మరో భాషకు సంబంధించిన ప్రేక్షకులను ఓటీటీలో అలరించడానికి రెడీ అవుతున్నారు.

నా సామిరంగ హిందీ స్ట్రీమింగ్ కు రెడీ

నా సామి రంగా హిందీ వెర్షన్ దాని స్ట్రీమింగ్ తో పాటు వరల్డ్ టీవీ ప్రీమియర్ తేదీ ఖరారు అయ్యింది. హిందీ వెర్షన్ ఒకేసారి ఓటీటీతో పాటు టెలివిజన్ ప్రీమియర్ కు కూడా రెడీ అయ్యింది. 2024 జూలై 23న కలర్స్ సినీప్లెక్స్ టీవి ఛానల్ లో టెలికాస్ట్ కానుంది. అలాగే అదే రోజున జియో ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ కూడా స్ట్రీమింగ్ కానుంది. గ్రామీణ యాక్షన్ డ్రామాతో ఉత్తర భారతీయ ప్రేక్షకులను ఆకర్షించే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరి నాగ్ మూవీకి హిందీ మూవీ లవర్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి

కాగా నాగార్జున ఇటీవలే ఓ వివాదంలో ఇరుక్కున సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్ట్ లో ఓ అభిమాని సెల్ఫీ తీసుకోవడానికి దగ్గరకు రాగా, నాగ్ సెక్యూరిటీ ఆయనకు పక్కకు నెట్టేశాడు. దీంతో నాగ్ పై సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ జరిగింది. క్షమాపణలు చెప్పినా జనాలు శాంతించకపోవడంతో అదే అభిమానితో మళ్లీ ఫోటో దిగారు నాగార్జున. అక్కడితో వివాదం సద్దుమణిగింది. కాగా ప్రస్తుతం నాగ్ కుబేర మూవీని చేస్తున్న సంగతి తెలిసిందే.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు