Mirzapur Season 4 : మోస్ట్ అవైటెడ్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ మీర్జాపూర్ 3 ఈ నెల 5న ఓటీటీ ప్రియుల ముందుకు వచ్చేసింది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సిరీస్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మొదటి రెండు సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ అంతగా బాగాలేదు అనే టాపిక్ వచ్చినప్పటికీ వ్యూస్ పరంగా మీర్జాపూర్ సీజన్ 3 చరిత్రను క్రియేట్ చేసింది. అలాగే మేకర్స్ బీజాపూర్ సీజన్ 4 అప్డేట్ ని కూడా ఇచ్చారు.
రికార్డు బ్రేకింగ్ వ్యూస్
‘మీర్జాపూర్ సీజన్ 3’ విడుదలైన వారంలోపే రికార్డు బ్రేకింగ్ వ్యూస్ సాధించి ప్రపంచ స్థాయిలో విజయవంతమైంది. ఈ ఇన్టెన్స్ క్రైమ్ డ్రామా మొదటి వారాంతంలో భారతదేశంలో ప్రైమ్ వీడియో చరిత్రలో అత్యధికంగా వీక్షించిన వెబ్ సిరీస్ గా చరిత్రను తిరగరసింది. రిలీజైన ఫస్ట్ వీకెండ్ లోనే భారతదేశంతో పాటు యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్, మలేషియాతో సహా 85 కంటే ఎక్కువ దేశాలలో ‘టాప్ 10’ జాబితాలలో ట్రెండ్ అయింది. అయితే కొంతమంది మాత్రం మీర్జాపూర్ సీజన్ 3కి ఈ స్థాయిలో వ్యూస్ వచ్చాయంటే నమ్మలేకపోతున్నారు. ఎందుకంటే మీర్జాపూర్ సీజన్ 3 ఏమంత బాగలేదని అంటున్నారు. 10 ఎపిసోడ్స్ ఉంటే అందులో చివరి మూడు మాత్రమే బాగున్నాయని, అలాగే మున్నా భయ్యాను మిస్ అయ్యామని అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే మీర్జాపూర్ సీజన్ 1, 2 అద్భుతంగా ఉన్నాయి. కాబట్టి పెద్దగా కష్టపడకుండానే సీజన్ 3పై హైప్, అంచనాలు భారీగా పెరిగాయి. అంతేకాదు సీజన్, సీజన్ కు మధ్య చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఆ ఎగ్జయిట్మెంట్ తో చాలా మంది మొదటి వీక్ లోపే మీర్జాపూర్ సీజన్ 3 సిరీస్ ను చూసి ఉంటారు. అందుకే ఈ స్థాయిలో వ్యూస్ దక్కాయి.
ఎక్సెల్ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మించిన ‘మీర్జాపూర్ 3’ చిత్రానికి గుర్మీత్ సింగ్ మరియు ఆనంద్ అయ్యర్ దర్శకత్వం వహించారు. ఈ సీజన్లో పంకజ్ త్రిపాఠి, అలీ ఫజల్, శ్వేతా త్రిపాఠి శర్మ, రసిక దుగల్, విజయ్ వర్మ, ఇషా తల్వార్, అంజుమ్ శర్మ, ప్రియాంషు పైన్యులి, హర్షిత శేఖర్ గౌర్, రాజేష్ తైలాంగ్, షీబా చద్దా, మేఘనా మాలిక్, మను రిషి చద్దా ఉన్నారు. పది ఎపిసోడ్ల సిరీస్ ఇప్పుడు ప్రైమ్ వీడియోలో భారతదేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా 240 దేశాల్లో ప్రత్యేకంగా ప్రసారం అవుతోంది.
మీర్జాపూర్ సీజన్ 4 విడుదల ఎప్పుడు ?
కాగా పనిలో పనిగా అప్పుడే మీర్జాపూర్ సీజన్ 4 షూటింగ్ ను కూడా మొదలు పెట్టామని ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. ప్రస్తుతానికి సీజన్ 4 విడుదల తేదీని ప్రకటించలేదు. అయితే 2020 అక్టోబర్ 23న సీజన్ 2, దాదాపు మూడు సంవత్సరాల గ్యాప్ తర్వాత సీజన్ 3 స్ట్రీమింగ్ అయ్యాయి. 2024 జూలై 5న మీర్జాపూర్ సీజన్ 4 స్ట్రీమింగ్ స్టార్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే సీజన్ 1, 2 మధ్య కేవలం రెండు సంవత్సరాల గ్యాప్ మాత్రమే ఉంది. కాబట్టి సీజన్ 4ని రెండేళ్ల విరామం తర్వాత అంటే 2026లో రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది.