Raj Tarun – Lavanya : సూసైడ్‌‌కి ముందు లాయర్‌తో లావణ్య వాట్సాప్ చాట్… స్క్రిన్ షాట్స్ వైరల్

Raj Tarun – Lavanya : శుక్రవారం అర్ధరాత్రి లావణ్య నార్సింగ్‌లో హైడ్రామా చేసిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి మీడియాకు, పోలీస్ నెంబర్ 112కు ఫోన్ చేసి, తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సమాచారం ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో అదే అర్థరాత్రి నార్సింగ్ పోలీసులు హుటాహుటిన లావణ్య నివాసానికి వెళ్లి.. లావణ్యకు కౌన్సింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ హైడ్రామా కు సంబంధించి మరో న్యూస్ బయటికి వచ్చింది.

శుక్రవారం అర్థరాత్రి ఆత్మహత్యాయత్నానికి ముందు లావణ్య తన లాయర్ కళ్యాణ్ తో చాటింగ్ చేసింది. ఆ చాట్ కు సంబంధించిన స్క్రిన్ షాట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. లావణ్య – అడ్వకేట్ కళ్యాణ్ కు మధ్య జరిగిన చాటింగ్ ఇలా ఉంది..

ఈ లోకంలో నా పయనం పూర్తి చేశా.. అందుకే ఈ లోకం నుంచి వెళ్లిపొతున్నా.
నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుబట్టారు.. నేను ఎవరో తెలియని వాళ్లు నా వెంట నిలిచారు.
రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయా.. మైండ్ గేమింగ్, గాసిప్స్‌తో విసిగిపోయా.
మస్తాన్ కేసులో నేను కీలుబొమ్మనయ్యా.. ప్రతీది ఒక పథకం ప్రకారం జరిగింది.
నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులతో పాటు మాల్వీ మల్హోత్రా కారణం.

- Advertisement -
Lavanya WhatsApp Chat ScreenShots
Lavanya WhatsApp Chat ScreenShots

అంటూ మెసేజ్ చేసింది. అయితే అప్పటికే నార్సింగి పోలీసులు లావణ్య నివాసినికి చేరుకుని, ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే రోజుకో మలుపు తిరుగుతున్న రాజ్ తరుణ్ – లావణ్యల కేసు ముందు ముందు ఎలా వెళ్తుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు