Sri Satya.. ప్రముఖ టెలివిజన్ ఆర్టిస్టుగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీ సత్య.. రియాల్టీ షో బిగ్ బాస్ లోకి వచ్చిన తర్వాత భారీ పాపులారిటీ సంపాదించుకుంది.. హీరోయిన్ మెటీరియల్ అని పిలిపించుకున్న ఈమెకు ఇండస్ట్రీలో హీరోయిన్ గా అవకాశాలు మాత్రం రావడం లేదు.. దాంతో బుల్లి తెరకే పరిమితమైంది.. అడపా దడపా షోలలో కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని.. డీజే టిల్లు టీం తనను మోసం చేసింది అంటూ హాట్ బాంబ్ పేల్చింది.. తాజాగా యాంకర్ శివ తో ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీ సత్య అసలు విషయాన్ని వెల్లడించింది.
డీ.జే. టిల్లు టీం మోసం చేసింది..
ఇంటర్వ్యూలో భాగంగా యాంకర్ శివ మాట్లాడుతూ.. పెద్ద సినిమాలో ఆఫర్ వచ్చిందంట కదా.. నటించిన తర్వాత లాస్ట్ ఎడిటింగ్ లో తీసేసారంట కదా.. అసలు ఏం జరిగింది ..? అంటూ ప్రశ్నించగా .. దీనికి శ్రీ సత్య మాట్లాడుతూ.. అవును పెద్ద సినిమాలోనే అవకాశం వచ్చింది.. అది నా సంగీత్ వీడియో సాంగ్.. చాలా రోజులు కష్టపడి షూటింగ్ చేసాము.. లెంగ్తీ గా వచ్చింది. చివర్లో సినిమా రన్ టైమ్ ఎక్కువగా వున్న నేపథ్యంలో కథను మార్చేసి.. కథకు తగ్గట్టుగా సినిమాను షార్ట్ చేశారు.. అలా నేను నటించిన పార్ట్ మొత్తం తీసేశారు.. సినిమాలో అవకాశం వచ్చిందని సంతోషపడేలోపే ఇలా జరిగింది అంటూ బాధపడింది శ్రీ సత్య ..ఇక ఆ సినిమా ఏంటి అని యాంకర్ ప్రశ్నించగా.. సిద్ధూ జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ నటించిన డీ.జే.టిల్లు 2 అని చెప్పి క్లారిటీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో నటించినందుకు పేమెంట్ కూడా ఇచ్చారని.. కానీ డబ్బులు తీసుకున్నందుకు తెరపై నన్ను నేను చూసుకోలేకపోయాను అంటూ బాధపడింది శ్రీ సత్య.
హీరోయిన్ గా అవకాశాలు రాకపోవడానికి బోలెడు కారణాలు..
ఇకపోతే హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదా లేక మీరే హీరోయిన్గా ట్రై చేయలేదా అని ప్రశ్నించగా.. తప్పకుండా సినిమాలలో హీరోయిన్ గా ట్రై చేస్తున్నాను.. కానీ అవకాశాలు రావడం లేదు.. సాధ్యమైనంత వరకు నాకు ఇండస్ట్రీలో అవకాశాలు రావాలి అంటే కష్టంతో పాటు అదృష్టం కూడా ఉండాలి అనుకుంటాను.. కానీ ఆ అదృష్టం నాకు ఇప్పటికైతే లేదు.. చాలా సినిమాలలో అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారి పోయాయి.. ఒకవైపు తెల్లగా ఉన్నావు.. పొడుగ్గా ఉన్నావు.. హీరోయిన్ ని డామినేట్ చేస్తున్నావు అని.. సిల్లీ కారణాలు చెప్పి కొన్ని సినిమాలలో తీసేశారు.. ఇక సినిమా పేర్లు చెప్పాలనుకోవట్లేదు. మరికొన్ని సినిమాలలో తెలుగమ్మాయి అనే ఒక కారణంతో కూడా తీసుకోవడం లేదు.. మరొకవైపు టీవీ ఆర్టిస్టు అనే కోణంలో కూడా అవకాశాలు రావడం లేదు. అందుకే ప్రస్తుతం టీవీ సీరియల్స్ లో నటించడం మానేశాను.. సినిమాలలో హీరోయిన్గా అవకాశం రావాలని కోరుకుంటున్నాను.. మరి ఆ అదృష్టం ఎప్పుడు వస్తుందో అంటూ తన మనసులో మాటను చెప్పుకొచ్చింది శ్రీ సత్య.
అదృష్టం లేక ఇండస్ట్రీకి దూరం..
గ్లామర్ షోలకి దూరంగా ఉంటూ కట్టుబొట్టు సంప్రదాయంగా కనిపిస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. అందానికి అందం అంతకుమించిన ప్రతిభ.. అన్నీ ఉన్నా కూడా అదృష్టం లేక అవకాశాలను కోల్పోతోంది శ్రీ సత్య .. మరి ఇప్పటికైనా ఈమె అందాన్ని, టాలెంట్ ని ఉపయోగించుకొని హీరోయిన్ గా ఒక అవకాశం కల్పించాలని అభిమానులు కోరుకుంటున్నారు.