RRR About Prabhas : ప్రభాస్‌ నాకు దగ్గరి బంధువు… తమ బంధుత్వం గురించి చెప్పిన MLA రఘురామ

RRR About Prabhas.. రెబల్ స్టార్ ప్రభాస్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. కృష్ణంరాజు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రభాస్.. అనతి కాలంలోనే మంచి పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్నారు. ముఖ్యంగా రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాతో ఊహించని పాపులారిటీ సొంతం చేసుకున్న ప్రభాస్.. ఈ సినిమా తర్వాత అన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలనే సెలెక్ట్ చేసుకుంటూ దూసుకుపోతున్నారు. ఇక ఓకే ఏడాది భూత ,భవిష్యత్తు, వర్తమాన కాలాలకు సంబంధించిన సినిమాలను తెరకెక్కించి రికార్డు సృష్టించిన ఈయన.. తాజాగా కల్కి 2898AD సినిమా చేసి ఊహించని రికార్డు క్రియేట్ చేశారు. ఇండియన్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కిన చిత్రంలో ఈయన నటించడమే కాదు.. అతి తక్కువ సమయంలోనే రూ .1000 కోట్లు వసూలు చేసి రికార్డు సృష్టించింది.
RRR About Prabhas : Prabhas is my close relative... MLA Raghurama told about their kinship..!
RRR About Prabhas : Prabhas is my close relative… MLA Raghurama told about their kinship..!

సినిమా వాళ్లు రాజకీయ నాయకుల కోసం పనిచేయడం తప్పు..

ఇదిలా ఉండగా ప్రముఖ రాజకీయ నాయకులు రఘురామకృష్ణం రాజు ప్రభాస్ గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకోవడమే కాదు.. ఆయన చాలా దగ్గర బంధువు అంటూ స్పష్టం చేశారు. తాజాగా ప్రముఖ మీడియా ఛానల్ తో భేటీ అయిన రఘురామకృష్ణం రాజు ప్రభాస్ గురించి వెల్లడించారు.. ప్రభాస్ నాకు చాలా దగ్గర బంధువు అని చెప్పిన ఈయనకు..  రాజకీయాలలో మీరు ఎన్నో విమర్శలు , ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు ప్రభాస్ ఎందుకు మిమ్మల్ని కలవడం కానీ.. పరామర్శించడం కానీ.. చేయలేదు ఎందుకు..? అని అడగ్గా.. దీనికి రఘురామకృష్ణంరాజు ఊహించని కామెంట్లు చేశారు.. అసలు సినిమా వాళ్లకు రాజకీయాలతో పని ఏంటి..?  సినిమా వాళ్ళకు మంచి గుర్తింపు ఉంటుంది.. ముఖ్యంగా సినిమా వాళ్లకి అటు వైసిపి ఫ్యాన్స్ వుంటారు.. ఇటు ఎక్స్ పార్టీ ఫ్యాన్స్ వుంటారు. ఒకరికి సపోర్ట్ చేస్తే ఇంకొక వర్గం ఫ్యాన్స్ హర్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు సినిమా వాళ్ళు రాజకీయ నాయకుల కోసం ప్రచారాలు చేయడం గాని,  వారి కోసం పనిచేయడం గాని లేదా వారి తరఫున మాట్లాడడం కానీ చేయకూడదు. ఒకవేళ వైసీపీ పార్టీని విమర్శిస్తే ఆ పార్టీ ఫ్యాన్స్ వారి సినిమాలు చూడరు. వాళ్ళకంటూ కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి.. అవన్నీ దాటుకొని వచ్చి రాజకీయ నాయకుల కోసం పనిచేయడం సాధ్యపడదు.. అలా చేయడం కూడా తప్పు..

ప్రభాస్ నాకు దగ్గర బంధువు – రఘురామకృష్ణంరాజు

ప్రభాస్ నాకు చాలా దగ్గర బంధువు.. బంధుత్వం కంటే మించి స్నేహం కూడా ఉంది.. అలాగే చాలామంది సెలబ్రిటీలతో స్నేహం ఉంది. కానీ వారు ఎవరు కూడా వచ్చి నాకోసం మాట్లాడాలని నేను ఏ రోజు కూడా అనుకోను.. వారు చేసింది కరెక్ట్.. రాజకీయ నాయకుల కోసం వచ్చి వారు వారి సినిమాల ద్వారా వారు ఇబ్బందులు ఎదుర్కోవడం నాకు ఇష్టం లేదు అంటూ క్లారిటీ ఇచ్చారు. మొత్తానికి అయితే ప్రభాస్ నాకు దగ్గర బంధువు అని తెలిపి అందర్నీ ఆశ్చర్యపరిచారు రఘురామకృష్ణంరాజు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు