Akhil Akkineni : గుర్తు పట్టలేనంతగా మారిపోయిన అఖిల్… కొత్త లుక్ వైరల్

Akhil Akkineni : ఇండస్ట్రీలో లక్ అనేది అందరికీ కలిసి రాదు. స్టార్ కిడ్ అనే ట్యాగ్ ఉన్నప్పటికీ, మంచి బ్యాక్ గ్రౌండ్ తో సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకొని నిలదొక్కుకోవడం అందరికీ సాధ్యం కాదు. ఇప్పటికే ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ కిడ్స్ అడుగు పెట్టి, ఒకటి రెండు సినిమాలతో కనిపించకుండా పోయిన విషయం తెలిసిందే. అయితే అక్కినేని వారసుడు అఖిల్ మాత్రం ఇప్పటికీ పోరాడుతూనే ఉన్నాడు. ఇప్పటివరకు తన కెరీర్ లో ఒక్కటంటే ఒక్కటి కూడా చెప్పుకోదగ్గ హిట్ పడనప్పటికీ ఈ హీరో ఇంకా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ హీరో కెరియర్ పై ఏజెంట్ గట్టి దెబ్బ కొట్టింది. అందుకే అప్పటి నుంచి బయట ఎక్కడా కనిపించట్లేదు అఖిల్. తాజాగా ఈ హీరో ఓ ఈవెంట్ లో కనిపించి కొత్త లుక్ లో షాక్ ఇచ్చాడు.

గుర్తు పట్టలేని విధంగా మారిపోయిన అఖిల్

తాజాగా సోషల్ మీడియాలో అఖిల్ అక్కినేని కొత్త లుక్ తెగ వైరల్ అవుతుంది. అందులో అఖిల్ గుర్తుపట్టలేని విధంగా మారిపోయాడు. అసలు విషయం ఏమిటంటే ఈ యంగ్ హీరో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ పెళ్లికి హాజరయ్యాడు. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లకు ఫోజులిచ్చాడు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇదివరకెన్నడూ లేని విధంగా వెరైటీ లుక్ లో దర్శనమిచ్చారు. గుబురు గడ్డం, బాగా పెరిగిపోయిన జులపాల జుట్టుతో స్టైలిష్ గా కనిపించాడు. ఇక పెళ్లిలో ఆయన బ్లాక్ కలర్ సూట్ లో న్యూ లుక్ లో కనిపించి తన అభిమానులను థ్రిల్ చేశాడు. దీంతో అఖిల్ ను ఇలా చూసిన అక్కినేని ఫ్యాన్స్ ఆయనను బిగ్ స్క్రీన్ పై చూడాలనుకుంటున్నామనే విషయాన్ని సోషల్ మీడియాలో కామెంట్స్ ద్వారా వెల్లడిస్తున్నారు. అంతేకాకుండా తన నెక్స్ట్ మూవీ అప్డేట్ ఇవ్వాలని, అయితే ఈసారి కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నారు.

Akhil Akkineni At Red Carpet For The Lagna Vidhi Of Anant Ambani & Radhika Merchant - YouTube

- Advertisement -

అఖిల్ లైనప్ లో ఇన్ని సినిమాలా?

ఇక ఏజెంట్ తర్వాత చాలా గ్యాప్ ఇచ్చిన అఖిల్ ఖాతాలో ప్రస్తుతం ఒకటి కాదు ఏకంగా మూడు సినిమాలు ఉన్నాయని సమాచారం. అయితే చాలా కాలం నుంచి యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ సినిమా చేయబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం అఖిల్ కనిపిస్తున్న కొత్త లుక్ ఆ సినిమా కోసమేనని తెలుస్తోంది. యూవీ క్రియేషన్ తో చేయబోతున్న ప్రాజెక్ట్ ను త్వరలోనే ప్రకటించబోతున్నాడు అఖిల్. మరి ఈ మూవీ తోనైనా అఖిల్ కలలుగంటున్న హిట్ తన ఖాతాలో వచ్చి పడుతుందేమో చూడాలి. మిగతా రెండు ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు తనయుడి కోసం కింగ్ నాగార్జున రంగంలోకి దిగబోతున్నాడని ప్రచారం జరుగుతోంది. నాగార్జున నిర్మాతగా డైరెక్టర్ మురళీకృష్ణ అబ్బూరి కాంబినేషన్లో అఖిల్ ఓ మూవీ చేయబోతున్నాడని అంటున్నారు. అయితే దీనిపై ఇంకా అఫీషియల్ గా అనౌన్స్మెంట్ రాలేదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు