1000Cr Movies : 1000 కోట్లు కొట్టడానికి ఏ హీరో ఎన్ని రోజులు తీసుకున్నాడో తెలుసా..?

1000Cr Movies : ఈరోజుల్లో వస్తున్న స్టార్ హీరోల సినిమాలు అన్ని కూడా బ్లాక్ బాస్టర్ హిట్ టాక్ ను అందుకుంటున్నాయి.. అందులో కొన్ని సినిమాలు మాత్రం 1000 కోట్లకు పైగా వసూల్ చెయ్యడం మాత్రమే కాదు ఇంటర్నేషనల్ వైడ్ మంచి టాక్ ను అందుకుంటున్నాయి.. సినీ ఇండస్ట్రీలో ఇటీవల కాలంలో వెయ్యి కోట్లు దాటిన బ్లాక్ బాస్టర్ సినిమాలు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం..

బాహుబలి 2..

దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించిన బ్లాక్ బాస్టర్ మూవీ బాహుబలి 2.. బాహుబలికి సీక్వెల్ గా ఈ సినిమాను తెరకెక్కించారు.. డార్లింగ్ ప్రభాస్, రానా ప్రధాన ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా 1000 కోట్లకు పైగా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ ను రాబట్టింది.. అయితే సినిమా కేవలం 10 రోజుల్లోనే వెయ్యి కోట్లను వసూల్ చెయ్యడం విశేషం.. సరికొత్త రికార్డ్ ను సొంతం చేసుకుంది.. రాజమౌళి తో పాటుగా సినిమాలో నటించిన అందరికీ మంచి పేరును అందించింది..

RRR…

రాజమౌళి నటించిన మరో బ్లాక్ బాస్టర్ మూవీ త్రిపుల్ ఆర్… తెలుగు స్టార్ హీరోస్ రామ్ చరణ్, ఎన్టీఆర్ లో ప్రధాన పాత్రలో నటించారు… ఈ సినిమా మంచి సక్సెస్ ను అందుకోవడంతో పాటుగా అతి తక్కువ రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.. కేవలం 16 రోజుల్లోనే 1000 కోట్లను అందుకోవడంతో పాటుగా ఆస్కార్ కు ఎంపిక అవ్వడం విశేషం..

- Advertisement -

KGF 2…

కన్నడ స్టార్ హీరో యశ్ నటించిన మాస్, యాక్షన్ మూవీ కేజీఎఫ్… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవ్వడంతో పాటుగా వెయ్యి కోట్ల క్లబ్ లోకి వచ్చేసింది.. కేవలం 16 రోజుల్లో ఈ సినిమా వెయ్యి కోట్ల క్లబ్ లోకి చేరింది..

జవాన్…

బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్, అట్లీ కాంబోలో వచ్చిన మూవీ జవాన్.. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో పాటుగా వెయ్యి కోట్లకు పైగా రాబట్టింది.. 18 రోజుల్లో రాబట్టి రికార్డు బ్రేక్ చేసింది..

పఠాన్…

షారుఖ్ కు ఇది రెండో 1000 కోట్ల సినిమా. సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన పఠాన్ మూవీ 27 రోజుల్లో 1000 కోట్లను అందుకుంది.

దంగల్…

బాలీవుడ్ లో హైయెస్ట్ కలెక్షన్లు సాధించిన దంగల్ సినిమా.. 1000 కోట్ల మార్క్ అందుకోవడానికి చాలా రోజుల టైం తీసుకుంది. పూర్తి రన్ లో 2000 కోట్లు కలెక్ట్ చేసిన దంగల్ మూవీ, 1000 కోట్లకు ఏకంగా 154 రోజులు పట్టింది.

కల్కి…

ఇప్పుడు ప్రభాస్ కల్కి ట్రెండ్ నడుస్తుంది.. ఈ సినిమా కేవలం 14 రోజుల్లోనే 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది. ప్రస్తుతం ఇండియన్ 2 మూవీకి డిజాస్టర్ టాక్ రావడంతో, ఈ కల్కి మూవీ కలెక్షన్లు మరింత పెరిగే ఛాన్స్ ఉంది.

కాగా, ఈ ఏడాది చివర స్టార్ హీరోల సినిమాలు విడుదల కాబోతున్నాయి.. ఏ సినిమా ఎన్ని కోట్లు రాబడుతాయో, ఎన్ని రోజుల్లో 1000 కోట్లు కలెక్ట్ చేస్తాయో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు