Dil Raju : దిల్ మావా జస్ట్ మిస్… లేదంటే ఆ నష్టానికి ఖేల్ ఖతం దుకాన్ బంద్ అయ్యేది

Dil Raju : దిల్ మావా ఓ పెద్ద నష్టం నుంచి జస్ట్ ఎస్కేప్ అయ్యాడు… ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ఇదే. ఒకవేళ ఆ సినిమా నిర్మాణంలో తలదూర్చి ఉంటే ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లు చూసి దిల్ రాజుకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపించేది అంటున్నారు నెటిజన్లు. మరి ఏ మూవీ విషయంలో దిల్ రాజు తీసుకున్న నిర్ణయం మంచిదయింది? అని విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.

దిల్ మావా జస్ట్ మిస్..

ప్రస్తుతం ఎక్కడ చూసినా భారతీయుడు 2 మూవీ గురించే చర్చ నడుస్తోంది. అయితే మూవీ సూపర్ డూపర్ అనేది మాత్రం ఈ చర్చ సారాంశం కాదు. శంకర్ మార్క్ మిస్ అయింది అంటూ సినిమాపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. మొదటినుంచి సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేయడంలో చిత్ర బృందం ఫెయిల్ అయింది. అయితే స్టార్ కాస్ట్ ఉండడంతోపాటు భారతీయుడు లాంటి బ్లాక్ బస్టర్ మూవీకి సీక్వెల్ కావడంతో సినిమాపై కొంతమందికి ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. కానీ జూలై 12న థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా కలెక్షన్లు చూస్తే మూవీ లవర్స్ తో పాటు చిత్ర బృందానికి కూడా దిమ్మతిరిగింది. కేవలం 26 కోట్ల కలెక్షన్లతో మొదటి రోజు ఈ మూవీ అతి తక్కువ ఓపెనింగ్స్ రాబట్టింది. ఈ నేపథ్యంలోనే చాలామంది నిర్మాత దిల్ రాజును తలచుకుంటున్నారు. ఆయన ఈ సినిమాను పక్కన పెట్టి మంచి పని చేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి డిజాస్టర్ మూవీని చేసి చేతులు కాల్చుకునే సాహసం ఆయన చేయకపోవడమే మంచిదైందనే టాక్ నడుస్తోంది.

Kamal Haasan's Indian 2: Dil Raju opts out of this big-ticket project - IBTimes India

- Advertisement -

అసలు ఏం జరిగిందంటే?

మొదట డైరెక్టర్ శంకర్ భారతీయుడు 2 మూవీని దిల్ రాజుతో కలిసి ప్లాన్ చేశారు. అఫీషియల్ గా డీల్ కూడా కుదుర్చుకున్నారు. కానీ మూవీ ఆలస్యం అవుతుండడం, శంకర్ ఈ సినిమాపై పెడుతున్న భారీ బడ్జెట్ కారణంగా దిల్ రాజు ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత శంకర్ గేమ్ ఛేంజర్ స్క్రిప్ట్ తో మరోసారి దిల్ రాజును సంప్రదించారు. దీంతో భారతీయుడు 2 లాంటి డిజాస్టర్ మూవీ చేజారి, గేమ్ ఛేంజర్ ప్రాజెక్ట్ ఆయన ఖాతాలో పడడం ఆసక్తికరంగా మారింది. అందుకే దిల్ రాజును అదృష్టవంతుడు అంటూ పొగుడుతున్నారు.

గేమ్ ఛేంజర్ సమస్య కాదా?

అయితే ఇప్పుడు ప్రతి ఒక్కరికి వచ్చే డౌట్ ఏంటంటే భారతీయుడు 2 సినిమాను తెరకెక్కించిన అదే శంకర్ గేమ్ ఛేంజర్ మూవీకి కూడా డైరెక్టర్. అలాంటప్పుడు ఆ మూవీని వదిలేసి ఈ మూవీని చేసినా కూడా బాధపడాల్సిందే కదా.. అంటే దానికి కూడా సమాధానం ఉంది. గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ లేట్ అవుతున్నప్పటికీ ఆ ఖర్చులను దిల్ రాజు మాత్రమే భరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మూవీ నిర్మాణంలో జీ కంపెనీ కూడా పాలుపంచుకుంటుంది. పైగా గేమ్ ఛేంజర్ పై భారతీయుడు కంటే హైప్ చాలా ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఆర్ఆర్అర్  తర్వాత చెర్రీకి ఉత్తరాదిలో మంచి మార్కెట్ క్రియేట్ అయింది. కాబట్టి ఈ మూవీ తెలుగు రాష్ట్రాలతో పాటు పాన్ ఇండియా రేంజ్ లో మంచి బిజినెస్ చేస్తుంది. అలా ఏ రకంగా చూసుకున్న గేమ్ ఛేంజర్ మూవీ దిల్ రాజుకు భారంగా మారదు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు