Raj Tarun Controversy: రాజ్ తరుణ్ ఎస్కేప్… 4 గంటల పాటు లావణ్య వాంగ్మూలం

Raj Tarun Controversy: యంగ్ హీరో రాజ్ తరుణ్ కేస్ ఇంట్రెస్టింగ్ ట్విస్టులతో కొనసాగుతోంది. ఈ వివాదానికి సంబంధించి బయటకు వస్తున్న ఒక్కో అప్డేట్ ఉత్కంఠతను రేకెత్తిస్తోంది. ఇప్పటిదాకా రాజ్ తరుణ్ తనను మోసం చేశాడంటూ ఆరోపించిన లావణ్య ఏకంగా సూసైడ్ వార్తలతో సంచలనం సృష్టించింది. తాజాగా మరోసారి మీడియా ముందుకు వచ్చిన లావణ్య పలు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించింది. తాజా అప్డేట్ ఏంటంటే నాలుగు గంటల పాటు లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు.

రాజ్ తరుణ్ ఆచూకీ తెలపాలంటూ రిక్వెస్ట్…

11 ఏళ్ల పాటు తనతో ఉన్న రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా అనే హీరోయిన్ మాయలో పడి తనను దూరం పెట్టాడంటూ లావణ్య మీడియా ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ హీరో తను సీక్రెట్ గా పెళ్లి కూడా చేసుకున్నామని, కడుపు చేసి ఆ తర్వాత అబార్షన్ చేయించాడని షాకింగ్ విషయాలను వెల్లడించింది. ఇప్పుడేమో మరో అమ్మాయి కోసం తనను దూరం పెడుతూ తప్పించుకు తిరుగుతున్నాడని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు తిండి పెట్టడానికి డబ్బులు ఇవ్వకుండా, 15 కుక్కలను తన మీదకు వదిలేసాడని పోలీసులకు కంప్లైంట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ముందుగా రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా లావణ్య ఆరోపణలలో కొట్టి పరేశారు. కానీ ఇప్పుడేమో లావణ్య సూసైడ్ అంటూ హంగామా చేసినప్పటికీ ఇద్దరూ నోరు మెదపట్లేదు.

లావణ్యకి నోటీసులు.., రాజ్ తరుణ్‌పై చర్యలు.. పోలీసులు భారీ ట్విస్ట్ | police officials made key comments On Raj Tarun - Lavanya Issue - Telugu Filmibeat

- Advertisement -

ఈ నేపథ్యంలోనే సోమవారం లావణ్యను పోలీసులు మరోసారి విచారణ కోసం పిలిపించారు. అందులో భాగంగా నాలుగు గంటల పాటు లావణ్య స్టేట్మెంట్ ను రికార్డ్ చేసినట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత మీడియాతో మాట్లాడిన లావణ్య ఈ విషయాలన్నీ వెల్లడిస్తూ రాజ్ తరుణ్ ఆచూకీ తెలపాలని పోలీసులను కోరానని చెప్పుకొచ్చింది. దీంతో మళ్లీ కొత్త అనుమానాలు తెరపైకి వచ్చాయి. అంటే రాజ్ తరుణ్ ప్రస్తుతం ఎస్కేప్ అయ్యాడా? ఎవరికి తెలియని ప్లేస్ లో దాక్కున్నాడా? అని ప్రశ్నిస్తున్నారు నెటిజెన్లు.

విచారణ ఆలస్యం..

తాజాగా తన అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకరతో కలిసి నార్సింగ్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వెళ్లిన లావణ్య ఈ వివాదానికి సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను పోలీసులకు సబ్మిట్ చేసింది. ఎఫ్ఐఆర్లో ఫిర్యాదు చేసిన దాని ప్రకారం తమ పెళ్లికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఇచ్చానని, తను మాట్లాడిన ప్రతి మాటను పోలీసులు రికార్డ్ చేశారని చెప్పుకొచ్చింది. మాల్వి మల్హోత్రాలతో పాటు ఆమె సోదరుడు తనను ఎలా భయపెట్టాడు అనే విషయం మీద కూడా స్టేట్మెంట్ ఇచ్చానని, అయితే ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అవసరమైతే విచారణకు రావాల్సి ఉంటుందని పోలీసులు చెప్పారని పేర్కొంది. లావణ్య తన స్టేట్మెంట్ ఆధారంగా దర్యాప్తు ముందుకు సాగాలని ఆశిస్తున్నానని చెప్పుకొచ్చింది. ఇక లావణ్య తరపు అడ్వకేట్ కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రెస్ మీట్ లో ప్రస్తుతం హైదరాబాదులో బోనాలు కొనసాగుతున్న కారణంగా ఇన్వెస్టిగేషన్ లేట్ అయ్యే అవకాశం ఉందని తమకు చెప్పారని వెల్లడించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు