Adhurs 2: దానిని పాడు చేసుకోకుండా అలా ఉంచడం బెటర్

Adhurs 2: ప్రస్తుతం స్టార్ డైరెక్టర్లు అంటే చాలామందికి ఎస్.ఎస్ రాజమౌళి సుకుమార్ త్రివిక్రమ్ శ్రీనివాస్ వంటి దర్శకులు ప్రస్తుత కాలంలో గుర్తుకు వస్తారు. కానీ ఒకప్పుడు స్టార్ డైరెక్టర్లు అంటే వివి వినాయక్ పూరి జగన్నాథ్ వంటి పేర్లు వినిపించేవి. వివి వినాయక్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఎంతోమంది హీరోలకు బ్లాక్ బస్టర్ హిట్స్ అందించాడు వినాయక్. ఆదిని స్టార్ హీరోని చేసిన ఘనత రాజమౌళికి ఎంతుందో అంతే వినాయక్ కు కూడా ఉంది. అలానే ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాతగా కొనసాగుతున్న దిల్ రాజు కు కూడా అద్భుతమైన హిట్ ఇచ్చి నిర్మాతగా నిలబెట్టాడు వివి వినాయక్.

ఇకపోతే వినాయక్ కెరియర్ లో ఆది సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అతి చిన్న ఏజ్ లోని ఎన్టీఆర్ ని చాలా పవర్ ఫుల్ గా చూపించి, కమర్షియల్ సినిమాకి కొత్త అర్ధాన్ని చూపించాడు. వినాయక్ కెరియర్ లో ఆది సినిమాకి ఉన్న స్థాయి వేరు స్థానం వేరు. అసలు ఆ సినిమా స్టార్ట్ అవ్వడమే వింతగా స్టార్ట్ అయింది. ముందుగా ఎన్టీఆర్ కోసం ఒక లవ్ స్టోరీని సిద్ధం చేసి పట్టుకెళ్లాడు వినాయక్. అయితే అది దాదాపు సెట్స్ మీదకు వెళ్ళిపోతుంది అనుకునే టైంలో కథను మార్చు వారు చెప్పాడు నిర్మాత కొడాలి నాని. అప్పుడు నానికి చెప్పిన ఐడియానే ఆది సినిమాగా బయటికి వచ్చింది.

మెగాస్టార్ చిరంజీవి కెరియర్ బ్లాక్ బస్టర్ హిట్

ఇకపోతే కేవలం స్టార్ హీరోలను చేయడమే కాకుండా స్టార్ హీరోలతో పని చేసిన అవకాశం కూడా వివి వినాయక్ దక్కింది. తమిళ్లో సూపర్ హిట్ అయినా రమణ అనే సినిమాను తెలుగులో ఠాగూర్ పేరుతో రీమేక్ చేసి మెగాస్టార్ చిరంజీవి కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అందించాడు. ఈ సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది అంతటి సంచలనాన్ని సృష్టించింది ఆ సినిమా. అలానే వెంకటేష్ తో లక్ష్మీ అనే సినిమాను సరిగ్గా ఎక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.

- Advertisement -

Adhurs

ఇకపోతే వినాయక్ కెరియర్లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. వాటిలో అదుర్స్ కూడా ఒకటి. ఆ సినిమాలో ఎన్టీఆర్ టైమింగ్ అదిరిపోతుంది. మళ్లీ అలాంటి సినిమా ఒకటే పడితే చూడాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అయితే అదుర్స్ సినిమాకి సీక్వెల్ గా ఒక సినిమాను ప్లాన్ చేయడానికి ఎప్పటినుంచో ట్రై చేస్తున్నాడు వినాయక్. కానీ కథ కొంత దూరం ముందుకు వెళ్లిన తర్వాత అది ఆగిపోతుంది. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆ సినిమాకి సీక్వెల్ చేయకుండా అలా వదిలేయడమే బెటర్. ఎందుకంటే ఒక సరైన కథ లేకపోతే దానిని పాడు పాడుచేసినట్లు అవుతుంది. సరైన కథ సెట్ కావట్లేదు కాబట్టి దాన్ని అలా వదిలేయడమే మంచిది. అంటూ ఆ సినిమా గురించి చెప్పుకొచ్చాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు