Indian 2: పెద్ద స్కాం ఇది, ఏ పాట కోసం వెళ్ళమో అది ఎండ్ టైటిల్స్ లో వేసాడు

Indian 2: ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్ ఎంతగానో ఎదురుచూసిన సినిమా ఇండియన్ 2. నిన్న ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమా తీవ్రంగా నిరాశపరిచింది. దాదాపు ఒక పదేళ్ల క్రితమే శంకర్ ఈ సినిమా కథను రాయడం మొదలు పెట్టాడు. ఈ కథను రాసిన వెంటనే భారీ స్థాయిలో దీన్ని తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేశారు. అయితే ఈ సినిమా మొదలైన వేళా విశేషం ఏమిటో తెలియదు కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి అన్ని అవాంతరాలే. ఈ సినిమాకి సంబంధించిన సెట్ కాలిపోవడం. అలానే అసిస్టెంట్ డైరెక్టర్ చనిపోవడం. ఇలా చాలా జరుగుతూ వచ్చాయి.

ఈ సినిమాకి నిర్మాతగా దిల్ రాజు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. రోజులు గడుస్తున్న కొద్ది ఈ సినిమా బాగా లేట్ అవ్వడంతో అనేక అవాంతరాలు ఎదురవడంతో ఈ సినిమా నుంచి నిర్మాతగా పక్కకు తప్పుకున్నారు దిల్ రాజు. మళ్లీ అదే శంకర్ తో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ అనే సినిమాను ప్లాన్ చేసుకున్నాడు. శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా మీద అందరికీ మంచి అంచనాలు ఉన్నాయి. ఇండియన్ టు సినిమా తర్వాత ఈ సినిమా మీద కొందరికి భయాలు కూడా మొదలయ్యాయి అన్నది వాస్తవం. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన కథ శంకర్ ది కాదు కాబట్టి కొద్దిపాటి ధైర్యం కూడా ఉంది.

ఇకపోతే ఇండియన్ టు సినిమాకి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు. ఇండియన్ సినిమాకి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. ఇండియన్ సినిమాలు కంటెంట్ అద్భుతంగా ఉండడం బట్టి ప్రతి సీన్లో ఒక ఇంపాక్ట్ రాయడం బట్టి రెహమాన్ అందించిన మ్యూజిక్ ఆ సీన్ ని కొంచెం ఎలివేట్ చేస్తూ ఆ సినిమాకి పెద్ద ప్లస్ అయింది. కానీ ఇండియన్ టు సినిమాకి సంబంధించి పెద్దగా ఎమోషనల్ సీన్స్ లేకపోవడం, అలానే కొన్ని అనవసరం లేని సీన్స్ ను ఇన్వాల్వ్ చేయటం వీటన్నిటి వలన కొద్దిపాటి కన్ఫ్యూజన్ ప్రాక్షకుడు మాత్రమే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కూడా మొదలైంది అని చెప్పొచ్చు. అందుకే అనిరుద్ మార్క్ ఈ సినిమాలో కనిపించలేదు.

- Advertisement -

Indian 2

ఇకపోతే పాటలు విషయానికి వస్తే ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసినప్పుడు అందరికీ అద్భుతంగా అనిపించింది. కేవలం ఈ పాట కోసమే సినిమాకు వెళ్లిన ఆడియన్స్ కూడా ఉన్నారు అనడంలో అతిశయోక్తి లేదు. అలా వెళ్లిన ఆడియన్స్ అందరికీ నిరాశ మిగిలింది. ఈ పాటను డైరెక్ట్ ఎండింగ్ టైటిల్ లో వేయడం వలన కొద్దిపాటి నిరాశ చాలామందికి కలిగింది. ఇంకొంతమంది సోషల్ మీడియా వేదిక ఇది పెద్ద స్కాం అంటూ కామెంట్స్ పెట్టడం కూడా మొదలుపెట్టారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు