AnantRadhikaWedding : స్నేహితులకు 25 కాస్ట్లీ ఎడిషన్ వాచ్ లు గిఫ్ట్ గా ఇచ్చిన అనంత్.. వ్యాల్యు తెలిస్తే దిమ్మతిరిగిపోద్ది!

AnantRadhikaWedding : భారతీయ ప్రముఖ వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ – రాధిక మర్చంట్‌ ల వివాహం జులై 12 రాత్రి అట్టహాసంగా ముంబై నగరంలో అంబానీకి చెందిన జియో వరల్డ్ డ్రైవ్‌ లో జరిగింది. కాగా నిన్న శుభ ఆశీర్వాద వేడుక కూడా జరిగింది. ఇక ఎంతో ఘనంగా జరిగిన ఈ వేడుకలో ఇండియాలో ఉన్న సినీ రాజకీయ ప్రముఖులు ఎందరో హాజరుకావడం జరిగింది. ఇక ఈ వేడుకలో పలువురు సౌత్ స్టార్ హీరోలు తమ ఫ్యామిలీస్ తో కలిసి విచ్చేయడం జరిగింది. రజినీకాంత్, రామ్ చరణ్, మహేష్ బాబు, వెంకటేష్, సూర్య వంటి అగ్రహీరోలు ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. అలాగే నిన్న సాయంత్రం జరిగిన ఫంక్షన్ లో జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు. ఇదిలా ఉండగా అనంత్ అంబానీ పెళ్లి వేడుకలో తన పెళ్ళికి వచ్చిన తన క్లోజ్ ఫ్రెండ్స్ కి కాస్ట్లీ ఎడిషన్ వాచ్ లు గిఫ్ట్ గా ఇవ్వడం జరిగింది.

Anant Ambani gifted Costly Edition watches to his friends on his wedding

కాస్ట్లీ వాచెస్ గిఫ్ట్ గా ఇచ్చిన అనంత్.. వ్యాల్యూ తెలుసా..

ఇక అనంత్ అంబానీ తన పెళ్ళికి వచ్చిన క్లోజ్ ఫ్రెండ్స్ కి అత్యంత ఖరీదైన 25 కాస్ట్లీ వాచ్ లు గిఫ్ట్ గా ఇవ్వడం వైరల్ గా మారింది. ఈ వేడుకలో తన స్నేహితులకు ఆడెమర్స్ పిగ్యెట్ రాయల్ (AUDEMARS PIGUET LIMITED) కి చెందిన కాస్ట్లీ ఎడిషన్ వాచ్ లని గిఫ్ట్ గా ఇచ్చాడు. ఇక వీటి రిటైల్ ధర సుమారు $105,000 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీ లో ₹87,69,000 రూపాయలు. ఇక ఈ వాచ్ ల మార్కెట్ ధర సుమారు $250,000 డాలర్లు. అంటే మార్కెట్ లో వీటి ధర అక్షరాలా ₹2,08,79,000 రూపాయలు. అంటే 2 కోట్ల రూపాయలన్నమాట. రెండు కోట్ల విలువ గల కాస్ట్లీ ఎడిషన్ 25 వాచ్ లను తన స్నేహితులకు గిఫ్ట్ గా ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. అలాగే ఈ స్పెషల్ వాచెస్ ని బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, రణవీర్ సింగ్ లకు కూడా గిఫ్ట్ గా ఇచ్చినట్టు సమాచారం.

- Advertisement -

గ్రాండ్ గా పెళ్లి వేడుక..

ఇక అనంత్ పెళ్ళి వేడుకకు సౌత్ నుండి సూపర్ స్టార్ రజనీకాంత్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ సూర్య, మలయాళ స్టార్ పృత్విరాజ్ సుకుమారన్, వెంకటేష్, రానా సహా ఎంతో మంది స్టార్ హీరోలు వారి ఫ్యామిలీతో సహాహాజరయ్యారు. అలాగే బాలీవుడ్ ఖాన్ త్రయం, బచ్చన్ ఫ్యామిలీ, హృతిక్ రోషన్, కపూర్ ఫ్యామిలీ తదితరులు హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మహా రాష్ట్ర సీఎం ఇలా ఎందరో రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు