Hyper Adhi.. జబర్దస్త్ ద్వారా కమెడియన్ గా తనకంటూ పేరు ప్రఖ్యాతలు సొంతం చేసుకున్న హైపర్ ఆది గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు.. జబర్దస్త్లో మంచి డైలాగ్లతో మెప్పించి.. టీం లీడర్ గా ఎదిగి ఇప్పుడు బుల్లితెర మీద తిరుగులేని హవా కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా ఈటీవీలో ఆధిపత్యం హైపర్ ఆది దే అని చెప్పాలి. జబర్దస్త్ వేదికగా వెలుగులోకి వచ్చిన ఆది.. ఇప్పుడు ఈటీవీలో ప్రసారమయ్యే అన్ని షోలలో కూడా కనిపిస్తూ అలరిస్తూ ఉన్నాడు.. ముఖ్యంగా యూట్యూబ్లో హైపర్ ఆది స్కిట్స్ కి విపరీతమైన వ్యూస్ వచ్చేవి.. హైపర్ ఆది జబర్దస్త్ లో సక్సెస్ అయిన నేపథ్యంలో మల్లెమాల సంస్థ ఢీ డాన్స్ రియాల్టీ షోలో ఛాన్స్ ఇచ్చింది.. అక్కడ కూడా ఆది సక్సెస్ అయ్యారు.. ముఖ్యంగా షోలో జడ్జెస్ మరియు యాంకర్ లు ఒకరిపై ఒకరు వేసుకునే జోక్స్ హైపర్ ఆది రాసినవే నట.. అవి బాగా ప్రాక్టీస్ చేసి.. అప్పటికప్పుడు మాట్లాడినట్లు కలరింగ్ ఇస్తారు.
శ్రీ సత్య కు వార్నింగ్ ఇచ్చిన ఆది..
ఇక జబర్దస్త్ మానేసిన హైపర్ ఆది ఢీ, శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి షోలు చేస్తూ దూసుకుపోతున్నాడు.. ఇక ఈ రెండు షోలలో కూడా హైపర్ ఆదిదే ఆధిపత్యం. ప్రస్తుతం ఢీ సెలబ్రిటీస్ స్పెషల్ సీజన్ 2 కి హైపర్ ఆది ఒక టీం కి లీడర్ గా వ్యవహరిస్తున్నారు. తాజా ఎపిసోడ్లో మరొక లీడర్ గా ఉన్న శ్రీ సత్య కి ఈయన వార్నింగ్ ఇవ్వడం సంచలనం సృష్టిస్తోంది. “నీకు అవకాశాలు లేకుండా చేసి.. నిన్ను అధఃపాతాళానికి తొక్కేయకపోతే నా పేరు హైపర్ ఆది నే కాదు” అంటూ వార్నింగ్ ఇవ్వడంతో ” హైపర్ ఆది కి ఎంత పొగరు కాకపోతే ఒక అమ్మాయి పట్టుకొని నేరుగా అందరి ముందు తొక్కేస్తానని వార్నింగ్ ఇస్తున్నాడు”: అంటూ అసహనం వ్యక్తం చేయడమే.. కాదు ఇతడి మాటలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి కామెడీ లో భాగంగా చేశారో లేకపోతే హైపర్ ఆది కావాలని ఇలా చేశారా అన్న విషయాలు ఎపిసోడ్ వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే
శ్రీ సత్య కెరియర్..
శ్రీ సత్య విషయానికొస్తే కొన్ని చిత్రాలలో నటించిన ఈమె అందంగా, తెల్లగా, పొడవుగా ఉంటుందన్న చిన్నచిన్న కారణాలతో సినిమాలలో అవకాశాలు వచ్చినా సరే తీసేస్తున్నారట ..హీరోయిన్ ని డామినేట్ చేస్తుందని మరికొన్ని సినిమాలలో తప్పించడం జరిగిందని, ఇంకొన్ని సినిమాలలో నటించి పారితోషకం ఇచ్చినా తర్వాత కూడా ఈమె నటించిన సన్నివేశాలను డిలీట్ చేస్తున్నారు అంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో పాల్గొని బాధపడింది శ్రీ సత్య. ఇక ఇటీవలే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో పాల్గొని భారీ పాపులారిటీ దక్కించుకుంది. ఇక ఇప్పుడిప్పుడే సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం కోసం బుల్లితెరకు దూరమయ్యే ప్రయత్నాలు చేస్తోంది. అందులో భాగంగానే సీరియల్స్ కి గుడ్ బై చెప్పేసిన ఈమె కేవలం కాంపిటీటివ్ షోలలో మాత్రమే అలరిస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికి అయితే శ్రీ సత్యకు వార్నింగ్ ఇచ్చి ఆది చేసిన కామెంట్లపై అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.