RiteishDeshmukh – Genelia : టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ సినిమాకు బాలీవుడ్ స్టార్ కపుల్ ప్రమోషన్..

RiteishDeshmukh – Genelia : టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ డైరెక్టర్ గా వరుస బ్లాక్ బస్టర్లు ఇచ్చిన డైరెక్టర్ కె.విజయ భాస్కర్‌. 20స్ లో ఎంటర్టైన్మెంట్ చిత్రాలకి కేరాఫ్ ఈయన. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, ‘మల్లీశ్వరి’ ప్రేక్షకులు మెచ్చిన క్లాసిక్ బ్లాక్ బస్టర్ సినిమాలు అందించారు విజయ్ భాస్కర్. అయితే ఆ తర్వాత మళ్ళీ ఆ స్థాయిలో హిట్లు కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస ప్లాప్ లతో గ్యాప్ తీసుకున్న ఈయన ఇప్పుడు ఒక లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అయ్యాడు. ఆ సినిమాయే “ఉషా పరిణయం”. ఈ చిత్రాన్ని దర్శకుడు అతన సొంత బ్యానర్ అయిన విజయ భాస్కర్ క్రాఫ్ట్ బ్యానర్‌పై నిర్మించారు. ఈ సినిమాలో విజయ భాస్కర్ కుమారుడు శ్రీ కమల్ ప్రధాన పాత్రలో నటించగా, తన్వి ఆకాంక్ష హీరోయిన్‌గా అరంగేట్రం చేసింది. ఇదిలా ఉండగా ఈ సినిమాని తాజాగా ఓ బాలీవుడ్ స్టార్ కపుల్ ప్రమోట్ చేసారు.

Riteish Deshmukh-Genelia promoted K.Vijay Bhasker's movie

ఉషాపరిణయం సినిమాకి రితేష్ – జెనీలియా ప్రమోషన్..

బాలీవుడ్ లో బెస్ట్ కపుల్స్ లో ఒకరు రితేష్ దేశముఖ్ జెనీలియా. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ ఇద్దరు తమ అన్యోన్య దాంపత్యంతో బాలీవుడ్ లో వన్ అఫ్ ది బెస్ట్ పెయిర్ అనిపించుకున్నారు. ఇదిలా ఉండగా తాజాగా విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసిన ఉషాపరిణయం సినిమాని ఈ స్టార్ కపుల్ ప్రమోట్ చేసారు. లేటెస్ట్ గా ఓ వీడియో రిలీజ్ చేసి అందులో విజయ్ భాస్కర్ గారు డైరెక్ట్ చేసిన సినిమా చూడమని, వారు తమకు ఆయనంత ఆప్తులు అని, ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నందుకు తాము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామని రితేష్ జెనిలీయా చెప్పుకొచ్చారు. ఉషాపరిణయం నుండి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అంటూ ఒక సాంగ్ ని రిలీజ్ చేస్తూ ఈ ప్రమోషనల్ వీడియో చేసారు.

- Advertisement -

విజయ భాస్కర్ తో రితేష్ – జెనీలియా అనుబంధం..

అయితే ఉషాపరిణయం చిత్రాన్ని రితేష్ – జెనీలియా నే ప్రమోట్ చేయడానికి కారణం ఉంది. రితేష్ జెనీలియా మధ్య ప్రేమ చిగురించడానికి కారణం డైరెక్టర్ విజయభాస్కరే కావడం విశేషం. ఎందుకంటే రితేష్ జెనీలియా కలిసి నటించిన తొలి చిత్రం ‘తుజే మేరీ కసమ్’ సినిమాని డైరెక్ట్ చేసింది విజయ్ భాస్కరే. అంతే కాదు హీరోగా రితేష్ దేశముఖ్ తొలి సినిమా కూడా ఇదే. 2003 లో లవ్ స్టోరీ గా విడుదలైన ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమాతోనే రితేష్ జెనీలియా ప్రేమలో పడ్డారు. ఆ కృతజ్ఞతని చాటుకుంటూ, డైరెక్టర్ విజయ్ భాస్కర్ తో తమ అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ, రితేష్ జెనీలియా ఉషా పరిణయం చిత్రాన్ని ప్రమోట్ చేసారు. ఇక ఉషా పరిణయం సినిమా ఆగష్టు 2న థియేటర్లలో విడుదల కానుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు