HBD Tanikella Bharani.. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న తనికెళ్ల భరణి.. రచయితగా, దర్శకుడిగా కూడా మంచి పేరు సంపాదించుకున్నారు ముఖ్యంగా కొన్ని కొన్ని సినిమాలలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కంటతడి పెట్టించడమే కాదు తన విలనిజంతో అందరికీ ఆగ్రహాన్ని తెప్పిస్తాడు కూడా.. నిత్యం శివ స్మరణ లో మునిగితేలే తనికెళ్ల భరణి.. సినిమాలలో నటిస్తూనే ఆ సినిమాల కథలు కూడా రచిస్తూ ఉంటారు. ముఖ్యంగా శివుని పై తనకున్న భక్తుని చూపిస్తూ కవితలు, పాటలు, కీర్తనలు రాస్తున్నారు.. అంతేకాదు ఆయన గొప్ప శివ భక్తుడు కూడా.. తన సినిమాలో విలక్షణమైన నటనతో ఎంతోమంది అభిమానులలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న తనికెళ్ల భరణి.. తన జీవితంలో ఒకసారి బెదిరింపులు ఎదుర్కోవాల్సి వచ్చింది అంటూ తెలిపారు. ఇకపోతే ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆయనకి సంబంధించిన ఇలాంటి ఎన్నో విషయాలు వైరల్ గా మారుతున్నాయి. అలాంటి వాటిలో ఇది కూడా ఒకటి.
ఆడవాళ్ళ చేతిలో దెబ్బలు తిన్న తనికెళ్ల భరణి..
అసలు విషయంలోకెళితే… తనికెళ్ల భరణి తాను ఎంచుకున్న పాత్రకు పూర్తిస్థాయిలో న్యాయం చేస్తారనటంలో సందేహం లేదు.. ముఖ్యంగా ఆయన అంతలా న్యాయం చేస్తారు.. కాబట్టే ఆ పాత్రల వల్ల నిజ జీవితంలో కూడా మహిళల చేత ఆయన ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు ..ఉదాహరణకు మాతృదేవోభవ సినిమా గురించి చెప్పుకోవాలి..ఇందులో హీరోయిన్ ని అత్యంత టార్చర్ చేసే విలన్ గా ఈ సినిమాలో తనికెళ్ల భరణి కనిపించారు.. ఈ సినిమా మంచి విజయం అందుకోవడమే కాదు ఇందులో నటించిన అందరికీ మంచి గుర్తింపు కూడా లభించింది.. అయితే ఒకసారి తనికెళ్ల భరణి సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తుండగా.. కొంతమంది మహిళలు చుట్టుముట్టి..అక్కడే ఈయనను చంపే ప్రయత్నం చేశారట …ఇక వారికి అక్కడ సర్ది చెప్పి అది కేవలం సినిమాలో పాత్ర మాత్రమే.. దయచేసి నన్ను విడిచి పెట్టండి అని ఆ మహిళలను వేడుకుంటే.. అక్కడ వారు ఆయనను విడిచిపెట్టినట్లు సమాచారం ..ఈ విషయాన్ని కూడా ఆయన గతంలో ఒకసారి వెల్లడించారు.. దీన్ని బట్టి చూస్తే ఆయన పాత్రలు ప్రజలలోకి ఏ విధంగా వెళ్తున్నాయో అర్థం చేసుకోవచ్చు..
చంపేస్తామని బెదిరింపులు కూడా..
ఇలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుందట.. ఈ.వీ.వీ .సత్యనారాయణ దర్శకత్వంలో ఊహ హీరోయిన్ గా నటించిన చిత్రం ఆమె. ఈ సినిమాలో ఊహ అక్క భర్త క్యారెక్టర్ లో తనికెళ్ల భరణి నటించారు. ఇందులో నెగిటివ్ పాత్రలో పోషించిన విషయం తెలిసిందే ఇక ఆమెను అత్యాచారం చేసి పెళ్లి చేసుకోవాలని, ఆమె సంపాదించే డబ్బును పొందాలని తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు.. ఇక ఈ సినిమాలో ఆయన నటనకు మంచి గుర్తింపు రావడమే కాదు అంతకుమించి బెదిరింపులు కూడా వచ్చాయి.. ఈ మూవీ అయిపోయిన తర్వాత చాలామంది ఆడవాళ్ళు చీదరించుకోవడంతో పాటు కనిపిస్తే రాళ్లతో కూడా దాడి చేశారట.. ముఖ్యంగా మహిళలు చంపేస్తామని బెదిరించారట.. ఇక అంతలా నటన అంటే ప్రేక్షకులు కూడా లీనమైపోయేలా నటిస్తూ ఆశ్చర్యపరుస్తూ ఉంటారు తనికెళ్ళ భరణి.. ఇక ఈ విషయాన్ని ఆయన స్వయంగా మీడియాతో వెల్లడించారు.