Kiran Abbavaram: ఉత్తరం రేపు 11 గంటల మూడు నిమిషాలకు వస్తుంది

Kiran Abbavaram: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన చాలామంది నటులు హీరోలుగా నిలబడ్డారు. ప్రస్తుత కాలంలో నాని రవితేజ వంటి చాలామంది హీరోలు చాలామందికి ఇన్స్పిరేషన్ గా మారారు. ఇక రీసెంట్ టైమ్స్ లో కూడా చాలామంది యంగ్ హీరోస్ స్వయంగా పైకి వచ్చారు. వారిలో విజయ్ దేవరకొండ, నిఖిల్, తేజ సజ్జ, విశ్వక్సేన్ వంటి ఎంతోమంది హీరోలు ఉన్నారు. అయితే అందరూ చాలా పద్ధతిగా సినిమాలు ప్లాన్ చేసుకుంటూ కెరియర్ లో ముందుకు వెళ్తున్నారు. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోని వ్యక్తుల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు ఒక హిట్ సినిమా పడింది అంటే అవకాశాల వరుసగా వెతుక్కుంటూ వస్తాయి.

రాజా వారు రాణి గారు సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు కిరణ్ అబ్బవరం. తను హీరో అవ్వడానికంటే ముందు చాలా షార్ట్ ఫిలిమ్స్ తో మంచి గుర్తింపును సాధించుకున్నాడు. రవి కిరణ్ కోలా దర్శకత్వం వహించిన రాజా వారు రాణి గారు సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన హిట్స్ సాధించింది. ఆ తర్వాత కిరణ్ కి వరుసగా అవకాశాలు వచ్చాయి. ఆ తర్వాత చేసిన సినిమా ఎస్ఆర్ కళ్యాణ మండపం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కమర్షియల్ గా అద్భుతమైన హిట్గా నిలిచింది. ఈ సినిమాలో కేవలం నటించడమే కాకుండా తనలోని రైటర్ టాలెంట్ ని కూడా బయటికి తీసాడు కిరణ్.

ఎస్ఆర్ కళ్యాణమండపం సినిమా హిట్ అయిన తర్వాత చాలా మంది కిరణ్ అప్రోచ్ అయ్యారు. చాలా పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌసెస్ నుంచి అడ్వాన్సులు వచ్చాయి. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అనే ఉద్దేశంతో అందరికీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చి వరుసగా సినిమాలు చేశాడు కిరణ్. అయితే ఎస్ ఆర్ కళ్యాణ మండపం సినిమా తర్వాత ఆ స్థాయిలో హిట్ అయిన సినిమా ఒకటి కూడా ఆయన కెరియర్లో లేదు. ఇక రీసెంట్గా రూల్స్ రంజన్ అనే సినిమా వచ్చినా కూడా అది ఆకట్టుకోలేదు.

- Advertisement -

Kiran Abbavaram

ఇక ప్రస్తుతం కిరణ కొంచెం గ్యాప్ తీసుకొని మరో సినిమాతో ప్రాక్టికల్ ముందుకు రానున్నాడు. ఈ సినిమా టైటిల్ రేపు రిలీజ్ చేయనున్నారు.అలానే ఈ సినిమాకి సంబంధించిన ఒక వీడియోను కూడా రేపు 11 గంటల మూడు నిమిషాలకు రిలీజ్ చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కిరణ్ ఈ సినిమాలో ఒక పోస్ట్ మాన్ గెటప్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు