Indian 2 : ప్రతి దర్శకుడు కి కూడా తమ కెరియర్ లో ఎన్నో అద్భుతమైన హిట్ సినిమాలు ఉంటాయి. అలానే విపరీతమైన గుర్తింపును పేరును సాధించిన సినిమాలు కూడా కొన్ని ఉంటాయి. అలా శంకర్ విషయానికొస్తే శంకర్ కెరియర్ లో ఎన్నో హిట్ సినిమాలు ఉన్నాయి. వీటన్నిటిని మించి భారతీయుడు సినిమాకి ఉండే రెస్పెక్ట్ వేరు. ఆ సినిమాని అంత అద్భుతంగా తెరకెక్కించాడు శంకర్. ఆ సినిమాకి ఎంచుకున్న కథ అలానే నటీనటులు పర్ఫామెన్స్ ఏఆర్ రహమాన్ మ్యూజిక్ అన్నీ కూడా అద్భుతంగా వర్కౌట్ అయ్యాయి.
అంతటి గొప్ప సినిమాకి సీక్వెల్ గా ఒక సినిమా రాబోతుంది అని అంటే అంచనాలు ప్రేక్షకులకు ఆటోమేటిక్ గా పెరిగిపోతాయి. ఈ సినిమాకి కూడా ఇదే జరిగింది. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా సినిమా వస్తుంది అని అనౌన్స్ చేసినప్పటి నుంచి అంచనాలు వేరే రేంజ్ లో పెరిగిపోయాయి. దాదాపు 10 ఏళ్ల క్రితం మొదలైన ఈ సినిమా ఈ 12వ తారీఖున ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఎన్నో అంచనాలతో థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి ఈ సినిమా నిరాశనే మిగిల్చింది. కొన్ని సీన్స్ ఎందుకు పెట్టారో అర్థం కాలేదు. దానితోపాటు మూడు గంటల పాటు ఉన్న ఈ సినిమా చాలామందికి బోర్ కొట్టింది అని కూడా చెప్పొచ్చు.
ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి ఒక 20 నిమిషాల పాటు ఫుటేజ్ ను ట్రిమ్ చేసినట్టు రీసెంట్ గా వార్తలు కూడా వినిపిస్తున్నాయి. చాలామంది శంకర్ అభిమానులు ఈ సినిమా విషయంలో నిరాశపడ్డారు. అయితే ఈ తరుణంలో కొంతమంది యంగ్ తమిళ్ ఫిలిం మేకర్స్ శంకర్‌ను పొగడటం మొదలుపెట్టారు. నిజంగా వాళ్లకి సినిమా నచ్చి శంకర్ ని పొగుడుతున్నారా లేదంటే శంకర్ పైన ఒక గురు భక్తితో పొగుడుతున్నారా అర్థం కాకుండా పోయింది.
#Indian2 is proof of our #Ulaganayagan @ikamalhaasan sir’s commitment to his craft. Kudos to @shankarshanmugh sir for bringing grand visions to life on a massive scale with @anirudhofficial’s scintillating background score for the film! 🤗❤️
Can’t wait for #Indian3 🔥🔥
— Lokesh Kanagaraj (@Dir_Lokesh) July 13, 2024
పిజ్జా సినిమాతో దర్శకుడుగా పరిచయమైన కార్తీక్ సుబ్బరాజు గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో కార్తీక్ సినిమా అంటేనే బీభత్సమైన అంచనాలు ఉంటాయి. అలానే మానగరం సినిమాతో దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్ కనకరాజ్. కేవలం తమిళ్లోనే కాకుండా తెలుగులో కూడా చాలామందికి ఫేవరెట్ డైరెక్టర్ లోకేష్. ఇక లోకేష్ కూడా శంకర్ ని పొగడ్తలతో ముంచేసాడు. వీరిద్దరి డైరెక్టర్స్ కి ఇండియన్ టు సినిమా నచ్చిందని ట్విట్టర్ వేదికగా కామెంట్ చేశారు. వీరిద్దరికీ శంకర్ స్పందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు.
#Indian2… Enjoyed @shankarshanmugh sir’s iconic big thoughts n ‘Larger than Life’ scale execution of those thoughts on Screen 👌👌👏👏 You are an inspiration always sir 🙏🏼🙏🏼❤️
Kamal sir as always was 🔥🔥
And to see Senapathy intro with Indian Theme was a Nostalgic High!!… pic.twitter.com/aSDdb0prUi— karthik subbaraj (@karthiksubbaraj) July 13, 2024