Vishwak Sen : మాస్ కా దాస్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ కి క్రేజీ టైటిల్?

Vishwak Sen : టాలీవుడ్ టాలెంటెడ్ హీరోలలో ఒకరైన విశ్వక్ సేన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. మాస్ కా దాస్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ తెచ్చుకున్న విశ్వక్ సేన్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాది ఆల్రెడీ గామి తో హిట్ కొట్టిన విశ్వక్, గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమాతో యావరేజ్ సక్సెస్ ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు క్రేజీ సినిమాలు చేయబోతున్నాడు విశ్వక్ సేన్. రీసెంట్ గా లైలా పేరుతో ఓ సినిమా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సినిమాలో లేడీ గెటప్ లో విశ్వక్ సేన్ నటిస్తుండడం విశేషం. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆల్రెడీ మొదలవగా, విశ్వక్ దీంతో పాటు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు అనౌన్స్ చేసాడు.

A solid title for Vishwak Sen's upcoming project

విశ్వక్ కొత్త సినిమాకి క్రేజీ టైటిల్?

ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్ (Vishwak Sen) లైలా, అలాగే మెకానిక్ రాకీ, సినిమాల షూటింగ్ లో ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాలతో పాటు తాజాగా దర్శకుడు కృష్ణ చైతన్య తో మరో సినిమా చేసేందుకు రెడీ అయ్యాడు విశ్వక్. ఇక వీరి కాంబోలో ఆల్రెడీ గ్యాంగ్స్ అఫ్ గోదావరి సినిమా వచ్చి అంతగా అలరించకపోయినా, ఇదే కాంబోలో మరో సినిమా వస్తుండడం విశేషం. ఇకపోతే ఈ సినిమాకు ఓ క్రేజీ టైటిల్ ని అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇక విశ్వక్ సేన్ నటించబోయే ఈ సినిమాకు ‘పవర్ పేట’ అనే టైటిల్ అనుకుంటున్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ఇండస్ట్రీలో ఉన్న కథనాల ప్రకారం ఈ సబ్జెక్టు ముందుగా నితిన్ వద్దకి వెళ్లిందట. కానీ నితిన్ తో సెట్ అవ్వలేదు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ విశ్వక్ చేతికి వచ్చిందని అంటున్నారు.

- Advertisement -

వరుస సినిమాలతో ఫుల్ బిజీ…

ఇక విశ్వక్ సేన్ ఈ ఇయర్ ఇప్పటికే రెండు సినిమాలు రిలీజ్ చేయగా, త్వరలో మెకానిక్ రాకీ ని ఇదే ఇయర్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమాతో రవితేజ అనే డైరెక్టర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి దీన్ని నిర్మిస్తున్నారు. అలాగే ఆ తర్వాత వచ్చే ఏడాది లైలా సినిమా రానుంది. ఆ తర్వాత కృష్ణ చైతన్య తో సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కాబోతుంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు