Prabhas: 3 డిజాస్టర్స్ పడగానే పనైపోయింది అనుకున్నారు, తన మార్కెట్ ఏంటో మరోసారి చూపించాడు

Prabhas: ఈశ్వర్ సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్ర ఇచ్చాడు ప్రభాస్. ఎమ్మెస్ రాజు నిర్మాతగా వ్యవహరించిన వర్షం సినిమా ప్రభాస్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఆ సినిమా పైన ముందు నుంచే చాలా నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్ అంతా. ఒకవైపు మెగాస్టార్ చిరంజీవి మరోవైపు నందమూరి బాలకృష్ణ వంటి స్టార్ హీరోలో సినిమాలు విడుదలైన టైంలోనే వర్షం సినిమాను విడుదల చేశారు. అనూహ్యంగా వర్షం సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ప్రభాస్ స్థానాన్ని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సుస్థిరం చేసింది. అయితే తన కెరీర్లో ప్రభాస్ ఎన్నో సూపర్ హిట్ సినిమాలను వదిలేసుకున్నాడు.

ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన చత్రపతి సినిమా ప్రభాస్ కి ఒక స్టార్ హీరో ఫాలోయింగ్ తీసుకొచ్చి పెట్టింది. ఆ సినిమా తర్వాత ప్రభాస్ ఫ్యాన్ బేస్ విపరీతంగా పెరిగిపోయింది. కేవలం మాస్ కమర్షియల్ ఆడియన్స్ మాత్రమే కాకుండా, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ అంటే సినిమాలు ప్రభాస్ ని ఫ్యామిలీ ఆడియన్స్ కి దగ్గర చేశాయి. బాహుబలి సినిమా ముందు రిలీజ్ అయిన మీరు చేసిన కూడా అద్భుతమైన హిట్స్ సాధించి ప్రభాస్ కెరియర్ ని ఇంకొంచెం ముందుకు నడిపింది. ఇక ప్రభాస్ కెరియర్ విషయానికొస్తే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అని చెప్పాలి.

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ట్ అయిపోయాడు ప్రభాస్. ఆ తర్వాత ప్రభాస్ ఏ సినిమా చేసినా అది ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యేది. చాలామంది ప్రభాస్ సినిమా కోసం చాలా క్యూరియాసిటీతో ఎదురు చూశారని చెప్పొచ్చు. బాహుబలి సినిమా సృష్టించిన సంచలనం అలాంటిది. అయితే ఇండియాలోనే హైయెస్ట్ మార్కెట్ ఉన్న హీరోగా ఆల్రెడీ ప్రభాస్ కి నేమ్ ఉంది. అయితే బాహుబలి సినిమా దాదాపు 1000 కోట్లకు పైగా వసూలు చేసింది. కేవలం బాహుబలి మాత్రమే కాకుండా రీసెంట్ గా చేసిన కల్కి సినిమాతో కూడా 1000 కోట్ల మార్కెట్ మరోసారి చూశాడు ప్రభాస్.

- Advertisement -

Kalki 2898 AD

బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ నటించిన మూడు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ గా మారాయి. దాదాపు ప్రభాస్ పని అయిపోయింది అని అందరూ అనుకున్నారు. ప్రభాస్ మళ్లీ వచ్చి ఎప్పటిలానే తెలుగులో సినిమాలు చేసుకొని ఎంటర్టైన్మెంట్ యాంగిల్ బయటకు తీసి ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేయాలి అనుకున్నారు. కానీ కల్కి సినిమా స్ట్రాంగ్ కం బ్యాక్ అవడంతో ప్రభాస్ గ్రాఫ్ ఇంకా మారిపోయింది. ఇక 1000 కోట్లు కలెక్షన్స్ సాధించిన సినిమాలు ప్రభాస్ కెరియర్ లో రెండు ఉన్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగతో చేయబోయే స్పిరిట్ సినిమా కూడా ఈ రేంజ్ లో ఉండబోతుంది అని అందరికీ అంచనాలు ఉన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు