Kalki2898AD : అందులో ఏముందని నేను చేయడానికి.. కల్కిపై నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు..

Kalki2898AD : టాలీవుడ్ లో రెండు వారాల కింద విడుదలైన కల్కి సినిమా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో అద్భుతమైన కలెక్షన్లతో దూసుకుపోతుంది. ఈ వారం మరో పాన్ ఇండియా సినిమా విడుదలైనా కూడా లిమిటెడ్ థియేటర్లలో సూపర్ కలెక్షన్లను వసూలు చేస్తూ దూసుకుపోతుంది. ఇక ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్ళని అందుకున్న కల్కి భారీ లాభాలను అందుకుంటుంది. ప్రభాస్ కి బాహుబలి2 తర్వాత వెయ్యి కోట్ల సినిమాగా నిలవగా, టాలీవుడ్ కి ఇది మూడో సినిమా కావడం విశేషం. ప్రభాస్ తో పాటు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ అభిమానులకు ఈ సినిమా ఐఫీస్ట్ గా నిలిచింది. ఇదిలా ఉండగా కల్కి సినిమా గురించి సీనియర్ నటుడు సుమన్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆయన రీసెంట్ గా చూసిన కల్కి సినిమా గురించి పలు ఆసక్తి కార విషయాలు చెప్పుకొచ్చారు.

Senior actor Suman sensational comments on the movie Kalki2898AD

అందులో నేను చేసేంత క్యారెక్టర్ ఏముందని – సుమన్

సీనియర్ నటుడు సుమన్ కల్కి రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో కల్కి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. సుమన్ తో యాంకర్ కల్కి లో మిమ్మల్ని మిస్ అయ్యాం… అని అంటుంటే ఏముందని మిస్ అవడానికి అంటూ వెంటనే రియాక్షన్ ఇచ్చారు. ఆ సినిమాలో మీకు మంచి రోల్ ఉండాలి అని మేము కోరుకున్నాం అని యాంకరమ్మ అంది. దీనికి సుమన్ షాకింగ్ రిప్లై ఇచ్చారు. సుమన్ సమాధానమిస్తూ… కల్కి సినిమా నేను చూసాను.. అసలు ఏముందని నేను కల్కిలో చేయడానికి.. అందులో సరైన క్యారెక్టర్ అయితే లేదు అన్నారు. అనే చాలా మంది స్టార్స్ అతిథి పాత్రల్లో కనిపించారు కదా అని యాంకర్ అన్నారు. దానికి సుమన్ అదే పెద్ద తప్పు. మంచి యాక్టర్స్ ని చిన్న రోల్స్ కే పరిమితం చేయడం వల్ల వాళ్ళ ఫ్యాన్స్ డిస్సపాయింట్ అయ్యారు అని చెప్పుకొచ్చారు.

- Advertisement -

కల్కి నాకు ఎలా అనిపించిందంటే – సుమన్

ఇక కల్కి సినిమా గురించి ప్రస్తావిస్తూ.. ఆ మూవీ లో చాలా మంది గెస్ట్ రోల్స్ చేశారు. అంతమంది స్టార్స్ ఉన్నప్పుడు ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉంటుంది. సినిమాలో అది లేకపోతే ఫ్యాన్స్ డిజప్పాయింట్ అవుతారు. ఈ కాలంలో చాాలా మంది చేసే తప్పు ఇదే. కొందరు డైరెక్టర్లు కాంబో హైప్ తో ఇలా స్టార్స్‌ ను పెట్టేసి జనాల్ని థియేటర్‌ కి రప్పిస్తారు. అప్పుడు ఫ్యాన్స్ డిస్సపాయింట్ అవుతారు. అలా చాలా సినిమాలు ఫెయిల్ అయ్యాయి. అంటూ చెప్పుకొచ్చారు. అయితే కల్కి సినిమా మీకు నచ్చిందా అని యాంకర్ అడిగారు. దానికి సుమన్ సమాధానమిస్తూ… నాకు మామూలుగా మాస్ సినిమాలంటే ఇష్టం. ఫ్రాంక్‍‌ గా చెప్పాలంటే కల్కిలో ఫస్టాఫ్ డ్రాగీగా అనిపించింది. ఒక అరగంట సీన్లు కంఫర్మ్ గా తీసేయొచ్చు. ముఖ్యంగా ఆ (దిశా పటాని) బాంబే హీరోయిన్ సాంగ్, ఓ ఫైట్ సీన్ లేపేయొచ్చు. అయితే సెకండాఫ్ మేకింగ్, ఫ్యూచరిస్టిక్ అంతా బావుంది. ఈ విషయంలో డైరెక్టర్ నాగ్ అశ్విన్ విజన్‌ కి నా సెల్యూట్. ఆయన మన ఇండియన్ ఇండస్ట్రీకి హాలీవుడ్ లెవల్లో కల్కి సినిమాను పరిచయం చేశాని చెప్పుకొచ్చారు.

అలాగే కల్కి సినిమాలో అమితాబ్ బచ్చన్ రోల్ చాలా డామినెంట్‌ గా, పవర్ ఫుల్ గా ఉందని, కమల్ హాసన్ పాత్ర అయితే స్టార్టింగ్ లో ఎండింగ్ లో మాత్రమే ఉంటుంది కానీ, పవర్ ఫుల్ గా ఉందని చెప్పుకొచ్చారు. ఇక ప్రభాస్‌ పాత్ర గురించి మాట్లాడుతూ ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అయితే ప్రభాస్‌ను ఒక టార్జాన్‌ లా చూపించాలి. ఆ రేంజ్ ఫిజిక్ అతనికి ఉంది. కానీ అలా చూపించకుండా ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి, షీల్డ్ పెట్టి బాడీ కవర్ చేసారు, అది అంతగా నచ్చలేదని, సాంగ్స్ అయితే అస్సలు బాగా లేవని, ఇక సినిమాని అయితే ఒక డిఫరెంట్ యాంగిల్‌ లో చూస్తేనే నచ్చుతుందని, అయితే కమర్షియల్ గా డబ్బులు బాగా వసూలు చేయడం వేరే విషయం అని చెప్పుకొచ్చారు. అయితే సుమన్ చెప్పిన చాలా పాయింట్స్ కి నెటిజన్లు కూడా అగ్రీ చేస్తున్నారు. ఎందుకంటే ఇందులో చాలామంది నటుల్ని వాళ్ళ స్థాయికి తగ్గట్టు చూపించకుండా అతిథి పాత్రల్లో చూపించి ఎండ్ చేసారు. అది చాలామందికి నచ్చలేదన్నమాట వాస్తవం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు