Rakshit Shetty: వివాదంలో కన్నడ హీరో .. పోలీస్ కేసు నమోదు.. మ్యాటరేంటంటే ?

Rakshit Shetty: కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సినిమాలకన్నా రష్మిక మందన్న మాజీ బాయ్ ఫ్రెండ్ అంటే అందరికి తెలిసే ఉంటుంది. తెలుగు చార్లీ అనే సినిమాతో ఆడియన్స్ కు దగ్గరయ్యాడు.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా కొత్త సినిమాలను తెరకెక్కిస్తుంటాడు . అలాగే అనుకోని వివాదాలకు కేరాఫ్ గా నిలుస్తున్నాడు. తాజాగా ఈ హీరో పై పోలీస్ కేసు నమోదు అయ్యింది.. అతనిపై బెంగళూరులోని యశ్వంత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు రక్షిత్ శెట్టిని పిలిపించి మాట్లాడారు. విచారణకు హాజరు కావాలని హీరోకు సమాచారం అందించారు.. అసలేం జరిగిందంటే..

ప్రముఖ మ్యూజిక్ కంపెనీ ఎంఆర్జి తమ అనుమతి లేకుండా వారి ఆల్బమ్ సాంగ్స్ ను రక్షిత్ తమ సినిమాల్లో వాడుతున్నట్లు ఆరోపిస్తున్నారు. అందుకే అతనిపై కాఫీ రైట్స్ కేసు వేసినట్లు తెలుస్తుంది.. ఈ హీరో ‘న్యాయ ఎల్లీడు..’, ‘గాలిమాతు..’ పాటలను రక్షిత్ శెట్టి నిర్మించిన ‘బ్యాచిలర్ పార్టీ’లో అక్రమంగా వాడుకున్నారని తెలిపారు. ఈ మేరకు కాపీ రైట్ ఆరోపణలపై రక్షిత్ శెట్టిపై పోలీస్ కేసు నమోదైంది.. ఈ ఏడాదిలో వచ్చిన బ్యాచిలర్ పార్టీ అనే సినిమాలో తమ రెండు పాటలను వాడినట్లు ఆ కంపెనీ వారు ఆరోపిస్తున్నారు..

కన్నడ హీరో రక్షిత్ శెట్టి కాపీరైట్, డిజిటల్ హక్కులను కొనుగోలు చేయకుండానే తమ కంపెనీ పాటలను ఉపయోగించుకున్నారని నవీన్ ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే అతనితో పాటు పరమవ స్టూడియోస్ పై కేసు పెట్టినట్లు ఆయన చెబుతున్నారు. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నటుడు రక్షిత్ శెట్టికి యశ్వంత్‌పూర్ పోలీసులు నోటీసులు జారీ చేశారు. విచారణకు త్వరలోనే హాజరు కావాలని నోటీసులు పంపించారు..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు